Naga Chaitanya : సమంత మంచి అమ్మాయి.. ఆమె సంతోషంగానే ఉండాలి.. నాగచైతన్య కామెంట్స్!

కస్టడీ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్య.. ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి, విడాకులు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Naga Chaitanya : సమంత మంచి అమ్మాయి.. ఆమె సంతోషంగానే ఉండాలి.. నాగచైతన్య కామెంట్స్!

Naga Chaitanya comments on samantha at custody promotions

Updated On : May 5, 2023 / 10:04 PM IST

Naga Chaitanya : నాగచైతన్య, సమంత (Samantha) విడిపోయి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా వారి విడాకులు గురించి మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ విషయం పై వారిద్దర్నీ పలు ఫ్లాట్‌ఫార్మ్‌లో అడుగుతూ ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు. తాజాగా మరోసారి వీరిద్దరి విడాకులు గురించి ఒక ఆంగ్ల మీడియా ప్రశ్నించింది. ప్రస్తుతం చైతన్య కస్టడీ (Custody) ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతతో విడాకులు గురించి ప్రశ్నించారు.

Custody Trailer : న్యాయం పక్కన నిలబడి చూడు.. నాగచైతన్య కస్టడీ ట్రైలర్ వచ్చేసింది..

దీనికి చైతన్య బదులిస్తూ.. “మేము విడిపోయి 2 ఏళ్ళు అవుతుంది. చట్టప్రకారంగా మాకు విడాకులు వచ్చి ఏడాది అవుతుంది. ప్రస్తుతం మేము ఎవరి జీవితంలో వారు ముందుకు వెళ్తున్నాము. జీవితంలో ప్రతి స్టేజిని నేను గౌరవిస్తాను. సమంత మంచి అమ్మాయి. ఆమె ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల వల్లే మా మధ్య ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరి పై ఒకరికి ఇష్టం లేనట్లు ప్రజల్లోకి వెళ్ళింది. అదే నాకు బాధ కలిగేలా చేసింది” అంటూ చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya : ఆ విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డాను..

అలాగే వీరిద్దరి మధ్య లేని ఒక మూడో వ్యక్తిని తీసుకు వచ్చి వార్తలు రాసి తమని ఇబ్బంది పెట్టడమే కాకుండా, ఆ మూడో వ్యక్తిని అగౌరవపరిచారు అంటూ వ్యాఖ్యానించాడు. “అసలు సినిమా ప్రమోషన్స్ లో వ్యక్తిగత విషయాలను ఎందుకు అడుగుతారో అర్ధం కాదని, మొదటిలో జవాబు ఇవ్వకుండా సైలెంట్ ఉండిపోయే వాడిని. అయినా ఇంకా ఆ నా పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తూనే ఉంటున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు వరకు విడాకులు పై ఇంతలా స్పందించని నాగచైతన్య.. ఇప్పుడు సమంత పై, విడాకులు పై ఇలా వ్యాఖ్యలు చేయడంతో వైరల్ అవుతున్నాయి.