Custody Trailer : న్యాయం పక్కన నిలబడి చూడు.. నాగచైతన్య కస్టడీ ట్రైలర్ వచ్చేసింది..

నాగ చైతన్య బై లింగువల్ మూవీ కస్టడీ ట్రైలర్ వచ్చేసింది.

Custody Trailer : న్యాయం పక్కన నిలబడి చూడు.. నాగచైతన్య కస్టడీ ట్రైలర్ వచ్చేసింది..

Naga Chaitanya Krithi Shetty Custody Trailer released

Updated On : May 5, 2023 / 4:57 PM IST

Custody Trailer : యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. పోలీస్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో చైతన్య నిజాయతి గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు.

Naga Chaitanya: అలా చేస్తే అభిమానులు చంపేస్తారట.. డైరెక్టర్‌కు చైతూ వార్నింగ్!

మే 12న రిలీజ్ కి రెడీ అవుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న క్రిమినల్ తప్పించిన హీరో అతని కాపాడుకునే ప్రయత్నంలో ఎదురుకున్న సమస్యలే సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. మాస్ట్రో ఇళయరాజా అండ్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.