Naga Chaitanya : చైతన్యకి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన లవ్ స్టోరీ.. తెర వెనక కథ ఏంటో తెలుసా?

శేఖర్ కమ్యూల్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ నాగచైతన్యకు కస్టడీ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ ని తీసుకు వచ్చింది. లవ్ స్టోరీకి కస్టడీ సినిమాతో సంబంధం ఏంటో తెలుసా?

Naga Chaitanya : చైతన్యకి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన లవ్ స్టోరీ.. తెర వెనక కథ ఏంటో తెలుసా?

Naga Chaitanya Custody movie chance is come from love story movie

Updated On : May 12, 2023 / 10:49 AM IST

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య నటించిన కస్టడీ (Custody) సినిమా నేడు (మే 12) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఓవర్సీస్ నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక్కడ కూడా కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడగా సూపర్ హిట్ టాక్ వినిపిస్తుంది. నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ మూవీగా కస్టడీ నిలిచిపోతుంది అని అంటున్నారు. మూవీ లోని యాక్షన్ సన్నివేశాలు మెయిన్ హైలైట్ అంటున్నారు. కాగా నాగచైతన్య కెరీర్ లో హిట్ అయిన సినిమాలన్నీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్.

Custody Review : కస్టడీ ట్విట్టర్ రివ్యూ.. చైతూ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుందట..

మాస్ హీరో ఇమేజ్ కోసం చేసిన దడ, బెజవాడ, దోచేయ్, సవ్యసాచి వంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాగచైతన్య హిట్టు మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో చైతన్యకి మాస్ ఇమేజ్ సినిమాలు సెట్ అవ్వడం లేదు అన్న కామెంట్స్ వినిపించాయి. ఒక సమయంలో చైతన్య కూడా నాగార్జున ముందు ఇదే మాటని అనడం గమనార్హం. అయితే కస్టడీతో తన మాట తానే తప్పు అని నిరూపించుకున్నాడు నాగచైతన్య. తనని కూడా మాస్ హీరోగా ఆడియన్స్ ఆదరిస్తారని ఈ సినిమాతో తేలిపోయింది.

Naga Chaitanya : వెంకీ మామయ్యపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.. రానానాయుడు సిరీస్ పై నాగచైతన్య కామెంట్స్..

అయితే ఈ మాస్ ఇమేజ్ సొంతం కావడంలో నాగచైతన్య మునపటి సినిమా లవ్ స్టోరీ పాత్ర ఉంది. శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాలో నాగచైతన్య ఒక బ్యాక్‌వార్డ్ క్యాస్ట్ కుర్రాడిగా తన పర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. చైతన్య దగ్గరకి కస్టడీ డైరెక్టర్ వెంకట్ ప్రభు కథ చెప్పడానికి వచ్చినప్పుడు, ఆ కథ విన్న నాగచైతన్య.. ఇంత మంచి కథని నాతో ఎందుకు చేయాలనీ అనుకుంటున్నారు. మీకు నాకన్నా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నారుగా అని ప్రశ్నించాడట. దానికి దర్శకుడు.. లవ్ స్టోరీ సినిమాలోని చైతన్య సెటిల్డ్ యాక్టింగ్ చూసి తన సినిమాలోని పాత్రని చైతన్య అయితే బాగా చేయగలడు అని నమ్మినట్లు, అందుకే చైతన్యని సంప్రదించినట్లు చెప్పుకొచ్చాడు.