Naga Chaitanya – Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య రియాక్షన్.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా..
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగ చైతన్య తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసారు.

Naga Chaitanya Reaction on Konda Surekha Comments goes Viral
Naga Chaitanya – Konda Surekha : నిన్న మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై విమర్శలు చేస్తూ.. నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అంటూ వ్యాఖ్యలు చేసింది. అలాగే సమంత పేరు ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్స్ కి డ్రగ్స్ అలవాటు చేసింది, కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడానికి కేటీఆరే అంటూ ఆరోపణలు చేసింది. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ, సమంత, సినీ పరిశ్రమ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే సమంత రియాక్ట్ అవ్వగా నాగచైతన్య కూడా స్పందించాడు. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగ చైతన్య తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసారు.
Also Read : Samantha Reaction : కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత రియాక్షన్
నాగచైతన్య కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. జీవితంలో విడాకులు బాధాకరమైన విషయాల్లో ఒకటి. చాలా ఆలోచించి మా పర్సనల్ కారణాల వల్లే నేను, నా మాజీ భార్య విడిపోయాము. జీవితంలో ఎవరి దారుల్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికే ఒకరిపై ఒకరు గౌరవంతో మేము విడాకులు తీసుకున్నాం. గతంలో కూడా మా విడాకులపై అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. మా రెండు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం కూడా ఉండాలి. సినీ ప్రముఖుల జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు అని అన్నారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు అక్కినేని ఫ్యామిలీకి, సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.
— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2024