Thandel Glimpse : తండేల్ గ్లింప్స్ రిలీజ్.. ఈపాలి ఏట గురితప్పేదేలే..

తాజాగా తండేల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Thandel Glimpse : తండేల్ గ్లింప్స్ రిలీజ్.. ఈపాలి ఏట గురితప్పేదేలే..

Naga Chaitanya Sai Palavi Essence of Thandel Released

Updated On : January 6, 2024 / 11:27 AM IST

Thandel Glimpse : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ తెరకెక్కుతుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే నాగచైతన్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా అదిరే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే తండేల్ సినిమా నుంచి నిన్న జనవరి 5న గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించి, టెక్నికల్ సమస్యలు అని చెప్పి నిన్నే రెండు సార్లు వాయిదా వేసి అభిమానులని నిరాశ పరిచారు. మళ్ళీ నేడు జనవరి 6న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా తండేల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Also Read : Ayalaan Trailer : ‘అయలాన్’ ట్రైలర్ చూశారా? ఏలియన్ ఇండియాకు వస్తే..?

తండేల్ కథ చిత్రయూనిట్ ముందే చెప్పేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లడంతో పాకిస్థాన్ వాళ్ళు పట్టుకుంటే ఎలా బయటకు వచ్చారు అని గతంలో జరిగిన యదార్థ ఘటనలతో తెరకెక్కిస్తున్నారు. దానికి ప్రేమ కథ, దేశభక్తి అంశాలు జోడించి తండేల్ సినిమాని కమర్షియల్ గా తీస్తున్నారు. తాజగా రిలీజ్ చేసిన గ్లింప్స్ అయితే అదిరిపోయింది. దీంతో అక్కినేని అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య మొదటిసారి ఫుల్ గడ్డంతో మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక గ్లింప్స్ చివర్లో సాయి పల్లవిని చూపించి ఆమె అభిమానులకు కూడా జోష్ ఇచ్చారు.