Naga Chaitanya: కొత్తగా అపార్ట్‌మెంట్ కొన్న చైతూ.. అందులోనే ఒంటరిగా?

అబద్దం అయితే బావుండని అభిమానులు కోరుకుంటున్నా కాలం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని జంట విడిపోయింది. పదేళ్ల ప్రేమ ప్రయాణానికి..

Naga Chaitanya: కొత్తగా అపార్ట్‌మెంట్ కొన్న చైతూ.. అందులోనే ఒంటరిగా?

Naga Chaitanya

Updated On : October 11, 2021 / 11:18 AM IST

Naga Chaitanya: అబద్దం అయితే బావుండని అభిమానులు కోరుకుంటున్నా కాలం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని జంట విడిపోయింది. పదేళ్ల ప్రేమ ప్రయాణానికి మధ్యలోనే కటీఫ్ చెప్పేసి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. తిరిగి మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా మారే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. కాగా.. సమంత హైదరాబాద్ వదిలి చెన్నై, ముంబై వెళ్తుందని కథనాలు కూడా రాగా అది ఎంతవరకు నిజమన్నది ఇంకా తెలియరాలేదు.

Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!

అయితే.. చైతూ మాత్రం హైదరాబాద్ లోనే మరో ఇంటికి షిఫ్ట్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చైతూ-సామ్ పెళ్లి తర్వాత గచ్చిబౌలిలోని ఓ ఇంట్లో ఉండేవారు. సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త మురళి మోహన్ ఆ ఇంటిని తన కోసమే నిర్మించుకోగా చైతూ-సామ్ ఆ ఇంటిని చూసి మనసుపడ్డారని వాళ్ళకి ఇచ్చేశాడు. విడాకుల ముందు వరకు చైతూ-సామ్ ఆ ఇంట్లోనే ఉండేవారు. కాగా, ఇప్పుడు సామ్ మాత్రమే అక్కడ ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఇది సామ్ ఆస్తి కావడంతో చైతూ బయటకొచ్చేశాడట.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

చైతూ-సామ్ విడాకులకు ముందే జూబ్లీహిల్స్ లో ఒక బంగ్లా కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటి రేనోవేషన్ పనులు జరుగుతుండగా ఇది చైతూకి చెందిన ఆస్తి. అయితే.. అది పూర్తిగా సిద్దమవ్వాలంటే మరో ఏడాది వరకు పట్టే అవకాశం ఉండడంతో చైతూ రెడీగా ఉన్న మరో అపార్ట్మెంట్ కొన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చైతూ అక్కడికే షిఫ్ట్ అయ్యాడని కూడా సమాచారం. జూబ్లీహిల్స్ బంగ్లా పూర్తయితే అక్కడకి షిఫ్ట్ అవనున్నాడట.