Rangabali : నాగశౌర్య ‘రంగబలి’కి రంగం సిద్ధం.. రిలీజ్ డేట్ అనౌన్స్!
నాగశౌర్య నటిస్తున్న కొత్త మూవీ 'రంగబలి'. ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ మూవీలోని నాగశౌర్య లుక్ ని రిలీజ్ చేశారు.

Naga Shaurya new movie Rangabali release date announced
Rangabali : నాగశౌర్య (Naga Shaurya) ఇటీవలే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిలిం థియేటర్ దగ్గర జస్ట్ ఓకే అనిపించింది. ఇక ఇప్పుడు ‘రంగబలి’ అనే సినిమాతో వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఈ మూవీని గత ఏడాది ఉగాది కానుకగా అనౌన్స్ చేశారు. అయితే ఏమైందో గాని ఈ మూవీ నుంచి మళ్ళీ ఈ ఏడాది ఉగాది వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఉగాది నాడు సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మూవీ షూటింగ్ జరుగుతుందని తెలియజేశారు.
Ustaad Bhagat Singh : ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది.. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ వచ్చేసింది..
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. ఈ ఏడాది జులై 7న ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ లో నాగశౌర్య లుక్ ఆకట్టుకుంటుంది. సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్ తో మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. నాని ‘దసరా’ సినిమాని తెరకెక్కించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇటీవల దసరా సినిమాని కూడా కొత్త దర్శకుడితో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ని అందుకుంది ఈ నిర్మాణ సంస్థ.
దీంతో ఆడియన్స్ లో ఈ మూవీ మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో నటించే హీరోయిన్ అండ్ ఇతర నటీనటుల వివరాలను తెలియాల్సి ఉంది. కాగా నాగశౌర్య ఈ సినిమాతో పాటు ‘పోలీస్ వారి హెచ్చరిక’, ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలను కూడా తెరకెక్కించబోతున్నాడు.
View this post on Instagram