నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అయిపోయింది: నాగార్జున ప్రకటన

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం జరిగిపోయిందని అక్కినేని నాగార్జున వెల్లడించారు.

నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అయిపోయింది: నాగార్జున ప్రకటన

Nagarjuna Akkineni confirms Naga Chaitanya Sobhita Dhulipala engagement

Updated On : August 8, 2024 / 2:12 PM IST

Naga Chaitanya Sobhita Dhulipala engagement: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య తండ్రి, సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ రోజు 9.42 గంటలకు నిశ్చితార్థం జరిగిందని ఆయన వెల్లడించారు. శోభిత ధూళిపాళను తమ కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. నాగచైతన్య, శోభిత జంటకు అభినందనలు తెలిపారు. వారిద్దరూ ప్రేమ, సంతోషంతో జీవించాలని ఆకాంక్షించారు. వారికి దేవుడు ఆశీసులు ఉంటాయని దీవించారు.

కాగా, అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలు నిజమయ్యాయి. వీరి రెండు కుంటుబాలు ఒప్పుకోవడంతో సన్నిహితుల సమక్షంతో ఎంగేజ్మెంట్ చేశారు. పెళ్లి ముహూర్తం ఎప్పుడనేది ఇంకా వెల్లడి కాలేదు. మంచి ముహూర్తం చూసి త్వరలో పెళ్లి చేస్తారని తెలుస్తోంది. నాగచైతన్య నిశ్చితార్థంపై అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని కుటుంబానికి అభినందనలు తెలుపుతున్నారు.

 

Also Read : తారకరత్న భార్య బర్త్‌డేని సెలెబ్రేట్ చేసిన వైఎస్ షర్మిల.. అక్కా అంటూ ఎమోషనల్ అయిన అలేఖ్య..