రణవీర్ సింగ్ కోసం.. నాగార్జున, కమల్ హాసన్‌ల సమర్పణ

రణవీర్ సింగ్ కోసం.. నాగార్జున, కమల్ హాసన్‌ల సమర్పణ

Updated On : January 24, 2020 / 12:56 PM IST

యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్.. కింగ్ నాగార్జునలు రణవీర్ సింగ్ కోసం సమర్పణకు సిద్ధమయ్యారు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన కపిల్ దేవ్ బయోపిక్ 83మూవీ తమిళ్, తెలుగు వర్షన్లలో రిలీజ్ కానుంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచి భారత్ సృష్టించిన ఘట్టం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. 

కపిల్ దేవ్ భార్య పాత్రలో దీపికా పదుకొనె కనిపిస్తుండగా మరో ప్రధాన పాత్రలో రోమి భాటియా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రణవీర్ సింగ్.. సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ తో పాటు ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అందులో కబీర్ ఖాన్, కమల్ హాసన్, నాగార్జునలు ఉన్నారు. 

ఈ సినిమాను కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌజ్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ తమిళనాడులో సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్.. తెలంగాణలలో నాగార్జున ప్రొడక్షన్ హౌజ్, అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకుంది. 

 

ఈ సందర్భంగా నాగ్ తన ట్విట్టర్లో ఫొటో పెట్టి ‘ఆ క్షణాన్ని తల్చుకుంటే ఇప్పటికీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. 83 తెలుగు వెర్షన్ ప్రెజెంట్ చేస్తున్నందుకు వెరీ హ్యాపీగా ఉన్నాను’ అని ట్వీట్ చేశాడు.