Nagarjuna Lawyer : మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం.. నాగార్జున తరఫు న్యాయవాది

నాగార్జున త‌రుపు న్యాయవ్యాది అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Nagarjuna Lawyer : మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం.. నాగార్జున తరఫు న్యాయవాది

Nagarjuna Lawyer comments over defamation case against konda surekha

Updated On : October 8, 2024 / 6:10 PM IST

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున నాంప‌ల్లి మ‌నోరంజ‌న్ కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ పిటిష‌న్ పై విచార‌ణ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం నాగార్జున కోర్టుకు హాజ‌రు అయ్యారు. ఆయ‌న స్టేట్‌మెంట్‌ను న్యాయ‌స్థానం రికార్డు చేసింది.

దీనిపై నాగార్జున త‌రుఫు న్యాయవ్యాది అశోక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాగార్జున‌తో పాటు మొద‌టి సాక్షిగా సుప్రియ స్టేట్‌మెంట్ల‌ను న్యాయ‌స్థానం రికార్డు చేసిన‌ట్లు చెప్పారు. అక్టోబ‌ర్ 10 గురువారం మ‌రో వాంగ్మూలం రికార్డు చేసి మంత్రి కొండా సురేఖ‌కు నోటీసులు జారీ చేసే అవ‌కాశం ఉంద‌న్నారు. మంత్రి మాట్లాడిన వీడియోల‌ను న్యాయ‌స్థానానికి స‌మ‌ర్పించామ‌ని తెలిపారు. వ్య‌క్తిగ‌తంగా, కుటుంబ ప‌రంగా ప‌రువుకు భంగం క‌లిగించాయి కాబ‌ట్టే.. క్రిమిన‌ల్, ప‌రువు న‌ష్టం కింద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిటిష‌న్‌ను దాఖ‌లు చేసిన‌ట్లు చెప్పారు.

Pushpa 2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. పుష్ప 2 నుంచి సాలీడ్ అప్‌డేట్‌..

ఇదిలా ఉంటే.. దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జున‌ను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వక వాఖ్యలు చేశారని నాగ్‌ తెలిపారు. దీని వలన తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందన్నారు. సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్ఠలు ఉన్నాయన్నారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని తెలిపారు.

తమ కొడుకు విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. అలా మాట్లాడం వలన తమ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని అన్నారు. మంత్రి కొండా సురేఖఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.