Bigg Boss : నీ వల్ల అమ్మాయిలు ఇబ్బంది పడితే బయటకు పంపించేస్తా.. మణికంఠకు నాగార్జున వార్నింగ్..
ఇటీవల మణికంఠ యష్మిని మాటిమాటికి హగ్ చేసుకుంటుంటే ఇష్టం లేకపోయినా, వద్దని చెప్పినా హగ్ చేసుకుంటున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Nagarjuna mass Warning to Naga Manikanta in Bigg Boss House
Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారం సాగుతుంది. నిన్న శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి వారం అంతా కంటెస్టెంట్స్ చేసిన గొడవలు, తప్పులు గుర్తుచేస్తూ ఒక్కొక్కరికి క్లాస్ పీకారు. వరుసగా గెలుస్తూ చీఫ్ అవుతున్నందుకు నిఖిల్ ని, ఎగ్ టాస్క్ బాగా ఆడారని అమ్మాయిలని అభినందించారు. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తగ్గించడానికి ప్రయత్నం చేసాడు నాగార్జున.
అభయ్ కి, విష్ణుప్రియకి క్లాస్ పీకిన తర్వాత నాగ మణికంఠకు కూడా గట్టిగానే క్లాస్ పీకారు నాగార్జున. ఇటీవల మణికంఠ యష్మిని మాటిమాటికి హగ్ చేసుకుంటుంటే ఇష్టం లేకపోయినా, వద్దని చెప్పినా హగ్ చేసుకుంటున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేసింది. హౌస్ లో ఉన్న మరి కొంతమంది లేడి కంటెస్టెంట్స్ ని కూడా మణికంఠ అలాగే హగ్ చేసుకున్నాడు. దీంతో ఈ విషయంలో నాగార్జున మణికంఠపై ఫైర్ అయ్యాడు.
Also Read : Ashok Galla : సైలెంట్‌గా మహేష్ బాబు అల్లుడి నెక్స్ట్ సినిమా మొదలు.. క్లాప్ కొట్టిన నమ్రత..
మణికంఠని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి.. అతని హగ్గుల వల్ల యష్మి పడుతున్న ఇబ్బందులను వీడియో రూపంలో చూపించి నీ వల్ల హౌస్ లో ఏ ఆడపిల్ల అయినా ఇంకోసారి ఇబ్బంది పడితే మొహమాట పడకుండా బయటకు పంపించేస్తాను. నువ్వు షోకు ఎందుకు వచ్చావో గుర్తుంచుకొని ఆడు. యష్మి విషయంలోనే కాదు, వేరే వాళ్ళ విషయంలో కూడా ఇలాగే చేస్తున్నావు అంటూ బాగా వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. దీంతో నాగ మణికంఠ.. ఇంకోసారి అలా జరగదు, కొత్తగా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అన్నాడు. మరి రాబోయే ఎపిసోడ్స్ లో మణికంఠ కంట్రోల్ లో ఉంటాడా మళ్ళీ అలాగే చేస్తాడా చూడాలి.