Naa Saami Ranga : నాగార్జున ‘నా సామిరంగ’ ఆ మలయాళ మూవీకి రీమేక్..?
నాగార్జున తన పుట్టినరోజు సందర్భంగా ‘నా సామిరంగ’ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఒక మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్..

Nagarjuna Naa Saami Ranga is remake of Porinju Mariam Jose
Naa Saami Ranga : టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) సినిమా కోసం అక్కినేని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఘోస్ట్ సినిమాతో నాగ్ చివరిగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. దాడ్పు ఏడాది పూర్తి అయ్యిపోయింది. కానీ ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటన ఇవ్వలేదు. ఇక నేడు నాగార్జున పుట్టినరోజు కావడంతో అభిమానులకు గిఫ్ట్ గా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశాడు. 99వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి ‘నా సామిరంగ’ అనే మాస్ టైటిల్ ని ఖరారు చేశారు.
Anchor Suma : టాలీవుడ్ యాంకర్స్‌కి సుమ ఇంట ఓనమ్ విందు..
గ్లింప్స్ లో నాగార్జున లుంగీ కట్టులో, బీడీ కాలుస్తూ మాస్ రోల్ లో కనిపించాడు. దీంతో ఈసారి నాగ్ నుంచి ఒక సరికొత్త ఎంటర్టైనర్ రాబోతుందని అందరూ ఫీల్ అయ్యారు. అయితే ఈ సినిమా ఒక మలయా సూపర్ హిట్ మూవీకి రీమేక్ అని సమాచారం. 2019లో రిలీజ్ అయిన ‘పోరింజు మరియం జోస్’ (Porinju Mariam Jose) అనే సినిమాకి ఇది రీమేక్ గా వస్తుందట. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కేరళలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరగనుంది.
Gadar 2 : రక్షాబంధన్ సందర్భంగా బంపర్ ఆఫర్.. 2 టికెట్లు కొంటే మరో 2 ఫ్రీ.. ఐదు రోజులు పండగే
అంతేకాదు మూవీ కూడా చివరికి నెగటివ్ ఎండింగ్ తో పూర్తి అవుతుంది. మరి నిజంగా నాగ్ చేస్తున్నది ఆ మూవీ రీమేక్‌నా? లేదా? అనేది తెలియదు. కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ డైరెక్ట్ చేయబోతున్నాడు. చిట్టూరి శ్రీనివాస ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ కూడా ప్రకటించేశారు.