Nagarjuna : ధనుష్ – శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున గెస్ట్ రోల్ ఫిక్స్.. పవర్ హౌస్ అంటూ అనౌన్స్..

గత కొన్నాళ్లుగా శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని సమాచారం. తాజాగా నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో దీనిపై అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

Nagarjuna : ధనుష్ – శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున గెస్ట్ రోల్ ఫిక్స్.. పవర్ హౌస్ అంటూ అనౌన్స్..

Nagarjuna plays guest role in Dhanush Sekhar Kammula Film

Nagarjuna : ఇటీవల తమిళ హీరోలంతా తెలుగులో, తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) తెలుగులో డైరెక్టర్ వెంకీ అట్లూరితో ‘సర్’(Sir) సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వంద కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తన సొంత దర్శకత్వంలో ధనుష్ 50వ సినిమా తెరకెక్కనుంది. ఆ తర్వాత ధనుష్ హీరోగా తెలుగులో మంచి క్లాస్ సినిమాలు అందించే దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో సినిమా ఉండనుంది.

ఈ ప్రాజెక్టు గతంలోనే అనౌన్స్ చేశారు. సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడగా ధనుష్ 50వ సినిమా అయ్యాక ఇది 51వ సినిమాగా తెరకెక్కనున్నట్టు ఇటీవల ధనుష్ పుట్టిన రోజు నాడు ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని కూడా ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయినట్టు తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషిస్తారని సమాచారం. తాజాగా నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో దీనిపై అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

Nag 99 : నాగ్ 99.. నా సామిరంగ.. మళ్ళీ సంక్రాంతి బరిలో కింగ్..

చిత్రయూనిట్ దీనిపై.. శేఖర్ కమ్ముల ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్టు లో ఒక పవర్ హౌస్ గెస్ట్ రోల్ కావలి అనుకున్నాం, టాలీవుడ్ కింగ్ నాగార్జున కంటే ఎవరు ఉంటారు. నాగార్జునని మరోసారి తెరపై చూపించడానికి ఎదురుచూస్తున్నాం. ఈ సారి షో మాములుగా ఉండదు అని తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. దీంతో నాగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే నాగ్ పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున 99వ సినిమాని ప్రకటించారు. నా సామిరంగ అనే టైటిల్ తో సంక్రాంతి బరిలో నిలబడనున్నారు నాగ్.