Bigg Boss 7 : బిగ్ బాస్ 7 ఫస్ట్ డే ప్రోమో వచ్చేసింది.. అప్పుడే లవ్ ట్రాక్ షురూ.. ఎవరో తెలుసా..?
బిగ్‌బాస్ సీజన్ 7 డే వన్ మొదలైపోయింది. ఇక హౌస్ లో మొదటిరోజే ప్రేమజంట కనిపించింది. ఎవరో తెలుసా..?
![Bigg Boss 7 : బిగ్ బాస్ 7 ఫస్ట్ డే ప్రోమో వచ్చేసింది.. అప్పుడే లవ్ ట్రాక్ షురూ.. ఎవరో తెలుసా..? Bigg Boss 7 : బిగ్ బాస్ 7 ఫస్ట్ డే ప్రోమో వచ్చేసింది.. అప్పుడే లవ్ ట్రాక్ షురూ.. ఎవరో తెలుసా..?](https://10tv.in/wp-content/uploads/2023/09/Nagarjuna-Telugu-Bigg-Boss-7-day-1-promo-released.jpg)
Nagarjuna Telugu Bigg Boss 7 day 1 promo released
Bigg Boss 7 : నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా బిగ్‌బాస్ సీజన్ 7 మొదలైపోయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి దాదాపు తెలిసిన వారే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పుడు ఎండింగ్ టైంలో సూట్ కేసు మనీ ఆఫర్ చేసి బిగ్ బాస్.. ఈ ఉల్టా-పల్టాలో ఎంట్రీలోనే ఆ మనీని ఆఫర్ చేశాడు. అయితే కంటెస్టెంట్స్ ఎవరు ఆ ఆఫర్ ని తీసుకోలేదు. కాగా హౌస్ లో కంటెస్టెంట్స్ మొదటిరోజు మొదలైంది. తాజాగా నిర్వాహకులు డే వన్ ప్రోమోని రిలీజ్ చేశారు.
Tillu Square : సెప్టెంబర్ నుంచి మరో సినిమా అవుట్.. టిల్లు స్క్వేర్ రిలీజ్ పోస్ట్‌పోన్..
నిన్న హీరో నవీన్ పోలిశెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. నేడు అక్కడి నుంచి మొదలు కాగా.. మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇక నవీన్ ఎంట్రీతోనే ఒక లవ్ ట్రాక్ మొదలైంది. రతిక రోజ్, పల్లవి ప్రశాంత్ మధ్య ఒక లవ్ ట్రాక్ ని ప్రోమోలో చూపించగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక శివాజీకి ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పడంతో అందరు షాక్ అవ్వడం. ప్రిన్స్ యావర్ బాడీ బిల్డింగ్ పై శివాజీ కామెడీ చేయడం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇక ప్రోమో చివరిలో బిగ్ బాస్ ఒక పెద్ద షాక్ ఇచ్చాడు.
Tiger Nageshwara Rao : ఎక్ ధమ్ నచ్చేసావే అంటూ ప్రేమ పాఠాలు చెబుతున్న గజదొంగ
కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇంకా వారి ఎంట్రీ కన్ఫార్మ్ కాలేదు అంటూ బాంబు పేల్చాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఆలోచనలో పడ్డారు. నాగార్జున ఆఫర్ చేసిన ఆ సూట్ కేసు మనీని తీసుకోని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు. మరి హౌస్ లో అసలు ఏమి జరుగుతుందో తెలియాలి అంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే. ఈలోపు ఆ ఎంటర్టైనింగ్ ప్రోమోని చూసేయండి.