Daaku Maharaaj : బాల‌య్య‌ ‘డాకు మ‌హారాజ్’ నుంచి సెకండ్ సింగిల్..

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న మూవీ డాకు మ‌హారాజ్‌.

Daaku Maharaaj : బాల‌య్య‌ ‘డాకు మ‌హారాజ్’ నుంచి సెకండ్ సింగిల్..

Nandamuri Balakrishna Daaku Maharaaj second single update

Updated On : December 19, 2024 / 6:53 PM IST

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న మూవీ డాకు మ‌హారాజ్‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రద్దా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్ లు క‌థానాయిక‌లుగా న‌టిస్తుండగా బాబీ డియోల్ విల‌న్‌గా కనిపించ‌నున్నాడు. శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది.

సంక్రాంతి కానుక‌గా 2025 జ‌న‌వ‌రి 12న‌ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల్లో చిత్ర బృందం వేగం పెంచింది. అందులో భాగంగా వ‌రుసగా అప్డేలు ఇస్తూ సినిమా పై అంచ‌నాల‌ను పెంచుతోంది. ఇప్ప‌టికే ‘డేగ డేగ డేగ’ అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది.

Sukumar : శ్రీతేజ్ కోసం హ‌స్పిట‌ల్‌కు సుకుమార్‌.. 5 ల‌క్ష‌ల సాయం చేసిన సుకుమార్ భార్య‌..

ఇక ఇప్పుడు రెండో పాట‌ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మైంది. ‘చిన్ని’ అనే సెకండ్ సింగిల్‌ను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా చిత్ర బృందం తెలియ‌జేసింది. ఓ చిన్నారిని బాల‌య్య పాఠ‌శాల‌కు తీసుకువెలుతున్న‌ట్లుగా ఆ పోస్ట‌ర్ ఉంది.

Dilruba : ‘క’ స‌క్సెస్ త‌రువాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘దిల్ రుబా’.. రిలీజ్ ఎప్పుడంటే?