తలసేమియా బాధితుల కోసం బాలయ్య పిలుపు..

  • Published By: sekhar ,Published On : September 30, 2020 / 09:31 PM IST
తలసేమియా బాధితుల కోసం బాలయ్య పిలుపు..

Updated On : September 30, 2020 / 9:37 PM IST

Nandamuri Balakrishna: అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని సినీ నటులు, హిందుపూర్ శాసన సభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పిలుపునిచ్చారు…




ఈ సందర్భంగా వారు తలసేమియా వ్యాధి గురించి వివరిస్తూ, రక్త దానం పట్ల ప్రచారంలో ఉన్న పలు అపోహలను తొలగించారు… ఎంత అభివృద్ధి చెందినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు కాబట్టి, తోటి ప్రాణాలను కాపాడడానికి మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రక్తదానం మాత్రమే అని తెలుపుతూ.. అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి, ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు బాలయ్య…