కరోనా సర్వనాశనం కోసం మన ఆయుధం సామాజిక దూరం..

కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన నందమూరి బాలకృష్ణ..

  • Published By: sekhar ,Published On : April 3, 2020 / 09:54 AM IST
కరోనా సర్వనాశనం కోసం మన ఆయుధం సామాజిక దూరం..

Updated On : April 3, 2020 / 9:54 AM IST

కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన నందమూరి బాలకృష్ణ..

కరోనా వైరస్ నియంత్రణకు వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఈ మహమ్మారి బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.

‘‘ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల దేశం రాష్ట్రం లాక్ డౌన్‌లో నడుస్తున్నాయి..
కరోనా మహమ్మారి ఏ రూపంలో ఎవర్ని కాటేస్తుందో అనే భయంలో మనం ఉన్నాం..
మనకు కనపడని కరోనా భూతంతో మనం యుద్ధం చెయ్యాలి.

Read Also : మీరెప్పుడూ తోడుంటారు.. థ్యాంక్యూ బ్రదర్ బాలయ్య..

భయం వదిలి సామాజిక దూరంతో కరోనా చచ్చే దాకా మనం పోరాడాలి.
కరోనా సర్వనాశనం కోసం మన ఆయుధం సామాజిక దూరం.. క్రమ శిక్షణతో మనంపాటిస్తున్న ఆరోగ్య నియమాలు మనకు రక్ష.ఎవరింటికి వారు పరిమితం కావాలి. సామాజిక దూరం పాటించాలి. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలి. స్వీయ నియంత్రణలో వుండి కరోనాని జయించాలి.
కరోనా నివారణ కోసం వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా.. వీళ్లందరూ మనకోసం మన ఆరోగ్యం కోసం 24 గంటలు కష్టపడి శ్రమిస్తున్నారు వాళ్లకు నా కృతజ్ఞతలు..

అలాగే రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు మానవతా వాదులు విస్తృత సేవలు అందిస్తున్నారు వాళ్లకు నా అభినందనలు. ఇంత మంది మనకోసం శ్రమిస్తుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో పొరపాటు చేస్తున్నాము.నా సోదర సోదరా మణులకు చేతులెత్తి విన్నవిస్తున్నాను.. కరోనా నియంత్రణలో మన బాధ్యత మనం నిర్వర్తించాలని తెలియ చేస్తున్నాను’’.. అంటూ వీడియో ద్వారా సందేశం విడుదల చేశారు నందమూరి బాలకృష్ణ.వ్యక్తిగత జాగ్రత్త పాటిద్దాం… కరోనాను తరిమి కొడదాం.కరోనా కట్టడికి అహర్నిశలు శ్రామిస్తున్న వైద్య సిబ్బంది కి,పోలీసులు కు,మున్సిపల్ సిబ్బందికి, కార్మికుల కు ప్రత్యేక ధన్యవాదాలు- మీ నందమూరి #బాలకృష్ణ?? #COVID2019india #HindupurMLA #HMLANBK pic.twitter.com/tJbOqUUN0K