Nandamuri Kalyan Ram: వైఎస్సార్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంది.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కళ్యాణ్ రామ్ ట్వీట్!
బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పేరుని తొలగించి “వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ”గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల దగ్గర నుంచి సాధారణ ఓటర్లు వరకు పలు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా స్పందిస్తూ..

Nandamuri Kalyan Ram Reaction on NTR Health University Issue
Nandamuri Kalyan Ram: బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పేరుని తొలగించి “వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ”గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల దగ్గర నుంచి సాధారణ ఓటర్లు వరకు పలు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా స్పందిస్తూ.. “1986లో మెడికల్ యూనివర్శిటీ విజయవాడలో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు.. ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేశారు. ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందడమే కాకుండా, నైపుణ్యం కలిగిన ఎంతోమంది వైద్య నిపుణులను కూడా దేశానికి అందించింది.
ఆ తరువాత తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఎన్టీఆర్ గారు చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి.. “డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్” అని పేరు మార్చబడింది. 25 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయం పేరును మార్చడం జరగలేదు. నాకు ఇది ఎంతో బాధను కలిగించింది. కేవలం రాజకీయ లబ్ది కోసం చాలా మంది భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు” అంటూ హెచ్చరిస్తూ ట్వీట్ చేశాడు.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 22, 2022