Nani 30 : నాని 30 అప్డేట్ వచ్చేసింది.. ‘హాయ్ నాన్న’ అంటూ వచ్చేస్తున్న నాని..

ప్రస్తుతం నాని 30వ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Nani 30 : నాని 30 అప్డేట్ వచ్చేసింది.. ‘హాయ్ నాన్న’ అంటూ వచ్చేస్తున్న నాని..

Nani and Mrunal Thakur Nani 30 Movie title announced as Hi Nanna and Glimpse Released

Updated On : July 13, 2023 / 11:13 AM IST

Nani 30 Movie Update :  నాని ఇటీవలే దసరా సినిమాతో భారీ హిట్ కొట్టి 100 కోట్ల కలెక్షన్స్ సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం నాని తన 30వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్‌ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ సినిమా రాబోతుంది. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రుతి హాసన్ (Shruti Haasan) ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం నాని 30వ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల నాని ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ని ఇచ్చాడు. ఆకాశంలో పారాగ్లైడింగ్ (Paragliding) చేస్తూ ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ ని నేడు జులై 13న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్ చేసేదానివి అన్నారు.. బేబీ దాకా వచ్చా.. స్టేజి మీద ఏడ్చేసిన వైష్ణవి చైతన్య..

నాని 30వ సినిమాకి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ని ప్రకటించారు. అలాగే చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్, నానికి కూతురుగా కనిపించే పాపని చూపించారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఒక ఎమోషనల్ స్టోరీ అని, సినిమాలో నాని భార్య చనిపోవడంతో పాపతో జీవిస్తూ ఉంటే మృణాల్ తన లైఫ్ లోకి పాప ద్వారా వస్తుంది అని అర్ధమవుతుంది. గతంలో జెర్సీ సినిమాలో నాన్న ఎమోషన్ తో ఆల్రెడీ నాని మెప్పించి ప్రేక్షకులని ఏడిపించాడు. ఇప్పుడు మళ్ళీ హాయ్ నాన్న అంటూ మరోసారి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది.