టక్ జగదీష్: డిఫరెంట్ లుక్.. హీరో ఎవరంటే?

దక్షిణాదిలో అందులోనూ తమిళ సినిమా ఇండస్ట్రీలో మనం ఎక్కువగా.. చిత్ర విచిత్రమైన పేర్లు వింటూ ఉంటాం.. తెలుగు సినిమాలకు వచ్చేసరికి పూరీ జగన్నాథ్ సినిమాలకు కాస్త డిఫరెంట్ టైటిల్ ఉంటుంది. అయితే, ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది రకరకాల టైటిళ్లు కొత్త కొత్తగా దస్తున్నాయి. అలాంటి వైవిధ్యమైన టైటిల్‌తోనే నేచురల్ స్టార్ నానీ హీరోగా సినిమా తెరకెక్కుతుంది. నానీ-శివనిర్వాణ కాంబినేషన్‍లో ఓ సినిమా వస్తుంది.
అయితే ఈ సినిమాకు ఓ విచిత్రమైన టైటిల్ పెట్టింది చిత్రయూనిట్. నానీ-శివనిర్వాణ కాంబినేషన్‌లో జనవరిలో ప్రారంభం కానున్న సినిమాకి టక్ జగదీష్ అనే టైటిట్ ఖరారు చేసింది చిత్రయూనిట్. ఈ మేరకు మంగళవారం టైటిల్ అనౌన్స్ మెంట్, ప్రీ లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రీ లుక్లో నానీ బ్యాక్ సైడ్ నుంచి టక్ చేసుకుంటున్నట్లుగా పోస్టర్‌లో ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.
టక్ జగదీష్‌లో ఇద్దరు హీరోయిన్‌లుగా చేస్తున్నారు రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు ఇందులో ఎస్ తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రఫీ. హారీష్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నానీ విలేజ్ కుర్రాడిగా కనిపించనున్నట్లు తెలుస్తుంది.