HIT 3 collections : ‘హిట్ 3’ తొలి రోజు కలెక్షన్.. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్..
నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం హిట్ 3.

Nani HIT 3 day 1 collection
నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘హిట్ 3’. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. హిట్ సిరీస్‌లో భాగంగా మూడో చిత్రంగా రూపుదిద్దుకుంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం గురువారం (మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
Prabhas-NTR : ప్రభాస్, ఎన్టీఆర్ సీక్రెట్ మల్టీస్టారర్!
ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో అధికారికంగా తెలియజేసింది. ఓ సరికొత్త పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. నాని కెరీర్‌లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా హిట్ 3 నిలిచింది.
SARKAAR’S BOX OFFICE MAYHEM collects a whopping 43+ CRORES GROSS WORLDWIDE on DAY 1 💥💥
Natural Star @NameisNani‘s HIGHEST DAY 1 GROSSER 🔥#HIT3 is the #1 INDIAN FILM WORLDWIDE YESTERDAY ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/8HrBsV0Ry1#BoxOfficeKaSarkaar… pic.twitter.com/IEuNsxZ5Sn— Wall Poster Cinema (@walpostercinema) May 2, 2025