Prabhas-NTR : ప్రభాస్, ఎన్టీఆర్ సీక్రెట్‌ మల్టీస్టారర్!

టాలీవుడ్‌లో ఓ సంచలన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Prabhas-NTR : ప్రభాస్, ఎన్టీఆర్ సీక్రెట్‌ మల్టీస్టారర్!

Prabhas NTR secret multi starrer

Updated On : May 2, 2025 / 10:00 AM IST

టాలీవుడ్‌లో ఓ సంచలన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్, ఎన్టీఆర్ లు కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా కోసం రహస్యంగా చర్చలు జరుపుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ఒక అగ్రశ్రేణి దర్శకుడు చేయబోతున్నారని చెప్పినా.. ఆయన పేరు మాత్రం ఇంకా బయటకు రాలేదు. కానీ కొందరు మాత్రం ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. పుష్పతో సంచనాలను క్రియేట్ చేసిన సుకుమారే అన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

ఇక కథ విషయానికొస్తే.. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని, ఇందులో ప్రభాస్ ఒక రెబెల్ లీడర్‌గా, ఎన్టీఆర్ ఒక సైబర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని టాక్. ఈ ఇద్దరు హీరోలు మొదట శత్రువులుగా మొదలై, ఒక పెద్ద విలన్‌తో కలిసి పోరాడతారట. అయితే హాలీవుడ్ స్టార్ ఒకరు ఈ సినిమాలో విలన్ గా నటించే అవకాశం ఉందని రూమర్స్ విన్పిస్తున్నాయి.

Bromance : ‘బ్రొమాన్స్’ మూవీ రివ్యూ.. మిస్ అయిన అన్న కోసం తమ్ముడు ఏం చేసాడు.. నవ్వుకోవాల్సిందే..

మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఒక బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్‌ను రంగంలోకి దించే ప్లాన్ ఉందని.. ఆమె ఒక సైంటిస్ట్ పాత్రలో సరికొత్త లుక్‌తో సర్‌ప్రైజ్ చేస్తారంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ దాదాపు 800 కోట్లు అని, ఇది టాలీవుడ్ నుంచి గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తుందని ఇన్‌సైడర్స్ చెబుతున్నారు.

అయితే.. ఈ చిత్రం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో, ఇది నిజమా లేక అభిమానుల ఊహాగానమా అన్న చర్చలు సాగుతున్నాయి. కొందరు ఈ కాంబినేషన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని హైప్ తప్పదని అంటున్నారు.