Nani : హాయ్ నాన్న ప్రెస్ మీట్స్ అంటూ.. ఆంధ్రా తెలంగాణ లీడర్స్‌ని ఇమిటేట్ చేస్తున్న నాని..

హాయ్ నాన్న ప్రెస్ మీట్స్ అంటూ ఆంధ్రా తెలంగాణ లీడర్స్‌ని ఇమిటేట్ చేస్తున్న నాని. మొన్న నారా లోకేశ్‌ని, ఇప్పుడు కెసిఆర్‌ని..

Nani : హాయ్ నాన్న ప్రెస్ మీట్స్ అంటూ.. ఆంధ్రా తెలంగాణ లీడర్స్‌ని ఇమిటేట్ చేస్తున్న నాని..

Nani imitates Andhra Telangana political leaders for his Hi Nanna promotions

Updated On : November 20, 2023 / 8:18 PM IST

Nani : నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా ‘హాయ్ నాన్న’ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ, ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చిన నాని.. కొంచెం క్రేజీగా ఆలోచించి పేరెంట్స్ మీటింగ్, పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అంటూ ప్రమోషన్స్ తోనే ఆడియన్స్ ని అలరిస్తున్నారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఫీవర్ నడుస్తుంది. దీంతో ఎలక్షన్ కాంపెయిన్ తరహాలో ఇటీవల ఒక క్రేజీ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో నాని మ్యానిఫెస్టో అంటూ నాని ఇచ్చిన హామీలు ఆడియన్స్ ని నవ్వించాయి. ఇక ఆ వీడియో స్టార్టింగ్ నాని మాట్లాడిన తీరు టీడీపీ నాయకుడు నారా లోకేశ్ ని ఇమిటేట్ చేసినట్లు అనిపించింది. గతంలో ఒకసారి నారా లోకేశ్ ప్రెస్ మీట్ పెట్టగా, అప్పుడు ఆయన మాట్లాడుతూ.. “అన్ని ఛానల్స్ వచ్చేశాయా..? ఏది ఆ ఛానల్ రాలేదేంటి..?” అంటూ ప్రశ్నిస్తారు. అప్పటిలో ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీంతో నాని ఇప్పుడు తన సినిమా ప్రమోషన్స్ కి దానిని స్పూఫ్ చేసేశారు.

Also read : Guntur Kaaram : గుంటూరు కారం సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

ఇక తాజాగా “ఊరికే ప్రెస్ మీట్ పెట్టా” అంటూ మరో ఎలక్షన్ వీడియో షేర్ చేశారు. ఈ కొత్త వీడియోలో నాని వ్యవహరించిన తీరు తెలంగాణ సీఎం కెసిఆర్ ని తలపిస్తుంది. ఎక్స్‌ట్రాలు ఎందుకయ్యా, ఏ ఆగభాయ్ నీ లొల్లి, ఈ పనికి మాలిన ఎవ్వారాలు ఎందుకయ్యా.. అంటూ కెసిఆర్ ప్రెస్ మీట్స్ ని అనుసరిస్తూ నాని చేసిన ఇమిటేట్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. మరి పొలిటికల్ ప్రచారం సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. కాగా డిసెంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది.