Dasara : జెర్సీ మూమెంట్ అంటున్న నాని.. దసరా సక్సెస్ మాములుగా లేదు..
నాని (Nani) నటించిన 'దసరా' (Dasara) సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసిన నాని.. ఇది తన అసలైన జెర్సీ మూమెంట్ అంటున్నాడు.

Nani shares his happiness about Dasara success
Dasara : నేచురల్ స్టార్ నాని (Nani) తాజాగా ‘దసరా’ (Dasara) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తెరకెక్కించాడు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటించగా, దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) ప్రధాన పాత్రలో కనిపించాడు. ఇక శ్రీరామనవమి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఈ క్రమంలోనే మొదటిరోజే ఏకంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.
Dasara Collections : నాని కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్.. అదరగొట్టిన దసరా కలెక్షన్స్..
అంతేకాదు ఈ సినిమాలో నాని నటనకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫిదా అయ్యిపోతున్నారు. మొదటిసారి రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో నటించి, తన నటవిశ్వరూపం చూపించాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ధరణి అనే పాత్ర తప్ప ఎక్కడా నాని కనిపించలేదు. దీంతో ప్రతి ఒక్కడు నానికి సలాం అంటున్నారు. ఇక తనకి వస్తున్న అభినందనలు చూసిన నాని.. ఇది తన అసలైన జెర్సీ మూమెంట్ అంటున్నాడు. నాని నటించిన జెర్సీ (Jersy) సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటది. ఆ మూవీలో తనకి క్రికెట్ జట్టులో స్థానం దక్కిన తరువాత రైల్వే స్టేషన్ కి వెళ్లి అరిచే సీన్ అందర్నీ టచ్ చేసింది.
Dasara Movie: అప్పుడు చిట్టిబాబు.. ఇప్పుడు ధరణి.. సేమ్ టు సేమ్..!
తాజాగా ఆ సీన్ ఫోటోను కొంచెం ఎడిట్ చేసి నాని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తన చేతిలో గొడ్డళ్లు పెట్టి దసరా అనే హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేశాడు. ఇక ఇది చూసిన నెటిజెన్లు నానికి అభినందనలు తెలియజేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని భాషల్లో మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అమెరికాలో కూడా ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజు 850K డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసి నాని కెరీర్ బెస్ట్ గా నిలిచింది.
♥️??#Dasara pic.twitter.com/7vWkxFoKf3
— Nani (@NameisNani) March 31, 2023