Vikkatakavi : ‘వికటకవి’ ట్రైలర్ చూశారా.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ థ్రిల్లర్..
తాజాగా నేడు వికటకవి సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

Naresh Agastya Megha Akash Vikkatakavi Web Series Trailer Released
Vikkatakavi : నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ మెయిన్ లీడ్స్ లో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సిరీస్ వికటకవి. జీ5 ఓటీటీలో ‘వికటకవి’ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఈ డిటెక్టివ్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. తాజాగా నేడు ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేసారు.
Also Read : Anirudh Ravichander : వామ్మో అనిరుధ్ మూవీ లైనప్ చూసారా.. ఒకేసారి అన్ని సినిమాలా.
ఈ ట్రైలర్ చూస్తే.. హైదరాబాద్ విలీనం తర్వాత ‘అమరగిరి’ అనే ప్రాంతంలో దేవతల గట్టు అనే చోటికి వెళ్ళడానికి ప్రజలు భయపడుతుంటారు. దాన్ని దేవత శపించిన గ్రామమని అక్కడి ప్రజలు అంటారు. ఆ సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే డిటెక్టివ్ రామకృష్ణను అతని ప్రొఫెసర్ పంపిస్తాడు. ఆ ఊరు వెళ్లిన రామకృష్ణకు అక్కడ ఎదురైన సవాళ్లు ఏంటి? ఆ ఊళ్ళో ఏం జరుగుతుంది అని ఆసక్తిగా ఈ సిరీస్ ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
మీరు కూడా ఈ వికటకవి సిరీస్ చూసేయండి..
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. వికటకవిలో డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నటించటం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఓ యువ డిటెక్టివ్ ఓ నిజాన్ని కనిపెట్టటానికి ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడు, ఊరిలోని సమస్యను ఎలా పరిష్కరిస్తారు అని ఆసక్తిగా ఉంటుంది ఈ సిరీస్ అని అన్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తొలి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇది. థ్రిల్లింగ్ కథాంశంతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన సంస్కృతిని కూడా చూపెట్టాము. ఈ నెలలోనే మా సినిమాలు మట్కా, మెకానిక్ రాకీలు కూడా విడుదల కానున్నాయి అని తెలిపారు.
డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ.. వికటకవి సిరీస్ అమరగిరి అనే ప్రాంతం చుట్టూ, అక్కడి మిస్టీరియస్, థ్రిల్లింగ్ అంశాలు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చూపిస్తుంది. 1970 ప్రాంతంలో తెలంగాణలో జరిగిన కథలా చూపించాము. ప్రేక్షకులను ఈ సిరీస్ థ్రిల్ చేస్తుంది అని అన్నారు.