Naresh : మంచు విష్ణు గెలుపు వెనుక ఉన్న నరేష్.. మా బిల్డింగ్ గురించి అడిగితే.. తననే అడగండి అంటూ..
మా ఎలక్షన్స్ సమయంలో మంచు విష్ణు గెలుపు వెనుకలా నరేష్ అడుగడునా ఉన్నారు. ఆ సమయంలో మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి నరేష్ కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు..

Naresh comments on Manchu Vishnu and MAA Association Building
Naresh : టాలీవుడ్ లో ఈరోజు జులై 30న ఎలక్షన్ల వేడి కనిపిస్తుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎలక్షన్స్ లో స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఎలక్షన్ పోలింగ్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరుగుతున్నాయి. ఇక తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూషన్, స్టూడియో అండ్ ఎగ్జిక్యూటివ్ సెక్టార్స్.. మెంబెర్స్ పోలింగ్ బూత్ కి చేరుకుంటున్నారు. ఇక ఈ ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి నటుడు, నిర్మాత నరేష్ కూడా వచ్చారు.
ఓటు వేసిన అనంతరం నరేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు.. నరేష్ ని మా అసోసియేషన్ బిల్డింగ్ (Maa Association Building) గురించి ప్రశ్నించారు. మా బిల్డింగ్ పనులు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించగా, నరేష్ బదులిస్తూ.. “ఆ విషయం మా ప్రెసిడెంట్ మంచు విష్ణునే అడగండి. ఆల్రెడీ ఆ బిల్డింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. దాని గురించి ప్రెసిడెంట్ చెబితే బాగుంటుంది” అంటూ మాట దాటేశారు. అయితే మా ఎలక్షన్స్ సమయంలో మంచు విష్ణు గెలుపు వెనుకలా నరేష్ అడుగడునా ఉన్నారు.
Brahmanandam : కుమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన బ్రహ్మానందం
ఆ సమయంలో మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి నరేష్ కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాని గురించి అడిగితే.. ప్రెసిడెంట్ విష్ణు అడగమనడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మా ఎలక్షన్స్ జరిగి ఆల్మోస్ట్ రెండేళ్లు అయ్యిపోతున్నాయి. మరోకొన్ని రోజులు నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కానీ మా బిల్డింగ్ పనుల్లో మాత్రం ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.