‘శ్యామ్ సింగ రాయ్’ ఎవరు?
ఫిబ్రవరి 24 నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్..

ఫిబ్రవరి 24 నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్..
నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 24 నాని బర్త్‌డే.. సోషల్ మీడియా ద్వారా సినీ రంగానికి చెందిన పలువురు బర్త్‌డే బోయ్‌కి విషెప్ తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ‘వి’, ‘టక్ జగదీష్’ సినిమాలు చేస్తున్న నాని తన 27వ సినిమాని ‘టాక్సీవాలా’ వంటి కామెడీ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్‌తో చేయనున్నాడు.
ఈ ఏడాది సంక్రాంతికి నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్ సాధించిన ‘అల వైకుంఠపురం’ చిత్రాన్ని నిర్మించిన సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటివరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పలు విజయవంతమైన సినిమాలను రూపొందించిన యంగ్ ఫిల్మ్ మేకర్ సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ వీడియో విడుదల చేశారు.
నాని హీరోగా నటిస్తున్న 27వ సినిమా ఇది. తొలి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాహుల్ నానిని సరికొత్తగా చూపిస్తూ, ఆసక్తికరమైన కథా కథనాలతో ఈ సినిమాను రూపొందిచనున్నాడు. క్రిస్మస్ కానుకగా 2020 డిసెంబర్ 25న ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి సమర్పణ పి.డి.వి.ప్రసాద్.