Naveen Polishetty : నితీష్ తివారి బాలీవుడ్ రామాయణంలో నవీన్ పోలిశెట్టి.. ఆ పాత్రలో..? బాలయ్య షోలో క్లారిటీ..

తన కామెడీ టైమింగ్ తో సినిమాల్లో, బయట అందర్నీ నవ్విస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నవీన్ పోలిశెట్టి.

Naveen Polishetty : నితీష్ తివారి బాలీవుడ్ రామాయణంలో నవీన్ పోలిశెట్టి.. ఆ పాత్రలో..? బాలయ్య షోలో క్లారిటీ..

Naveen Polishetty Gives Clarity on Nitesh Twiari Bollywood Ramayanam Movie

Updated On : December 7, 2024 / 9:30 AM IST

Naveen Polishetty : షార్ట్ ఫిలిమ్స్ నుంచి కెరీర్ మొదలుపెట్టి తెలుగు, హిందీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిన్న చిన్న పాత్రలు చేసి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో స్టార్ అయ్యాడు. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మెప్పించాడు. తన కామెడీ టైమింగ్ తో సినిమాల్లో, బయట అందర్నీ నవ్విస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

అయితే కొన్ని నెలల క్రితం నవీన్ కి యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. రికవరీ అయ్యాక మొదట బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చాడు. ఈ షోలో తన గురించి బోలెడన్ని విషయాలు పంచుకున్నాడు. బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆరో ఎపిసోడ్ లో నవీన్ పోలిశెట్టితో పాటు శ్రీలీల కూడా వచ్చింది. ఈ షోలో బాలయ్య నవీన్ ని ప్రశ్నిస్తూ.. బాలీవుడ్ లో నితీష్ తివారి తీస్తున్న రామాయణంలో నువ్వు లక్ష్మణుడి పాత్ర చేస్తున్నావని వార్తలు వచ్చాయి అది నిజమేనా అని అడిగారు.

Also Read : Balakrishna – Naveen Polishetty : బాలయ్యపై కామెడీగా ఓ కవిత చెప్పిన నవీన్ పోలిశెట్టి.. ఏమని చెప్పాడో తెలుసా?

దానికి నవీన్ పోలిశెట్టి సమాధానమిస్తూ.. ఇలాంటి రూమర్స్ వినడానికి బాగుంటాయి. నిజమైతే ఇంకా బాగుండు. ఇలాంటి రూమర్స్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయండి. ఈ రూమర్స్ తో అయినా నాకు అలాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తే బాగుండు అని అన్నారు. దీంతో ఇది జస్ట్ రూమర్ అని క్లారిటీ ఇచ్చేసాడు నవీన్. బాలీవుడ్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. గతంలో నితీష్ తివారి దర్శకత్వంలో ఛిచ్చోరె సినిమాలో నవీన్ కీలక పాత్ర పోషించాడు. ఇక నవీన్ పోలిశెట్టి త్వరలో అనగనగా ఒక రాజు సినిమాతో రాబోతున్నాడు.