Naveen Polishetty : తమిళ్ మల్టీస్టారర్ మిస్ చేసుకున్న నవీన్ పోలిశెట్టి.. నవీన్ ప్లేస్ లో..

జిగర్‌తండా సినిమాకి డైరెక్టర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ సీక్వెల్ ని తీసుకు వస్తున్నాడు. జిగర్‌తండా డబుల్ ఎక్స్(Jigarthanda Double X) అనే పేరుతో ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.

Naveen Polishetty : తమిళ్ మల్టీస్టారర్ మిస్ చేసుకున్న నవీన్ పోలిశెట్టి.. నవీన్ ప్లేస్ లో..

Naveen Polishetty Missed Chance in Jigarthanda Double X Movie

Updated On : October 11, 2023 / 11:12 AM IST

Naveen Polishetty : 2014లో సిద్దార్ధ, బాబీ సింహ, లక్ష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కార్తీక్ సుబ్బ‌రాజ్(Karthik Subbaraj) తెరకెక్కించిన తమిళ సినిమా ‘జిగర్‌తండా’. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా జాతీయ అవార్డులను కూడా అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమాని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమాని హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ చేశాడు.

ఇప్పుడు జిగర్‌తండా సినిమాకి డైరెక్టర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ సీక్వెల్ ని తీసుకు వస్తున్నాడు. జిగర్‌తండా డబుల్ ఎక్స్(Jigarthanda Double X) అనే పేరుతో ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రాఘవ లారెన్స్, SJ సూర్య నటిస్తున్నారు. రాఘవ లారెన్స్(Raghava Lawrence) రౌడీ పాత్రలో నటిస్తుండగా, SJ సూర్య(SJ Suryah) ఫిలిం మేకర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ కాగా తెలుగులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ.. జిగర్‌తండా డబుల్ ఎక్స్ సినిమా కథ మొదట రాఘవ లారెన్స్ గారికే చెప్పాను. ఆయన ఓకే చెప్పారు. ఆ తర్వాత ఫిలిం మేకర్ పాత్రను SJ సూర్యకు చెప్తే నో చెప్పారు. అప్పుడు ఆ పాత్రను తెలుగు హీరో నవీన్ పోలిశెట్టికి చెప్పాము. అతనికి కూడా స్క్రిప్ట్ నచ్చింది. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వక నవీన్ ఈ సినిమా వదిలేసుకున్నాడు. దీంతో మళ్ళీ మా నిర్మాతని పంపించి SJ సూర్యని ఒప్పించాం అని తెలిపాడు.

Also Read : Aamir Khan : నేను, నా కుమార్తె మానసిక సమస్యలని ఎదుర్కొన్నాం.. కూతురితో కలిసి అమీర్ ఖాన్ వీడియో..

దీంతో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. నవీన్ తమిళ్ ఎంట్రీ ఇచ్చే సినిమాని వదులుకున్నాడని పలువురు కామెంట్స్ చేయగా హీరోగా దూసుకుపోతున్నప్పుడు తమిళ్ మల్టీస్టారర్ చేయకపోవడమే మంచిది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ జిగర్‌తండా డబుల్ ఎక్స్ సినిమా దీపావళికి రానుంది.