Naveen Polishetty : టాలీవుడ్‌లో కపిల్ శర్మ లాంటి షో ప్లాన్.. హ్యాట్రిక్ తర్వాత నవీన్ నెక్స్ట్ సినిమాలు ఇవే..

వరుస సినిమాలు హిట్స్ కొట్టడంతో నెక్స్ట్ ఏ సినిమాలతో రాబోతున్నాడో నవీన్ అని ఎదురు చూస్తున్నారు. ఇటీవల నవీన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సక్సెస్ మీట్ లో పాల్గొనగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి తెలిపాడు.

Naveen Polishetty : టాలీవుడ్‌లో కపిల్ శర్మ లాంటి షో ప్లాన్.. హ్యాట్రిక్ తర్వాత నవీన్ నెక్స్ట్ సినిమాలు ఇవే..

Naveen Polishetty Next Movies list he wants to plan a tv show like Bollywood Kapil Sharma Show

Updated On : September 22, 2023 / 10:05 PM IST

Naveen Polishetty : యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు లాంటి సినిమాలతో భారీ హిట్స్ కొట్టి ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. దాదాపు పదేళ్లకు పైగా కష్టపడి యూట్యూబ్ వీడియోల నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హ్యాట్రిక్ హిట్స్ కొట్టే హీరోదాకా ఎదిగాడు నవీన్ పోలిశెట్టి.

దీంతో నవీన్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అని అందరూ నమ్ముతున్నారు. వరుస సినిమాలు హిట్స్ కొట్టడంతో నెక్స్ట్ ఏ సినిమాలతో రాబోతున్నాడో నవీన్ అని ఎదురు చూస్తున్నారు. ఇటీవల నవీన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సక్సెస్ మీట్ లో పాల్గొనగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి తెలిపాడు.

Ghost : కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ దసరాకి.. హై ఓల్టేజ్ ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ మ్యూజిక్’ రిలీజ్..

నవీన్ మాట్లాడుతూ.. ప్రతి మూవీ సక్సెస్ నాపై హీరోగా బాధ్యత పెంచుతుంటుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటి స్క్రిప్ట్స్ లాక్ అయ్యాయి. నెక్ట్ ఇయర్ మూడు మూవీస్ ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయి. వాటి అప్ డేట్స్ నేనే మీకు చెప్తా. హిందీలో రెండు మూడు కథలు విన్నాను కానీ ప్రస్తుతానికి తెలుగులోనే నటిద్దాం అని అనుకుంటున్నాను. టైమ్ దొరికితే కపిల్ షో లాంటి మంచి హ్యూమరస్ టీవీ ప్రోగ్రాం చేయడానికి రెడీ. అయితే సినిమాలతోనే టైమ్ సరిపోతోంది. అది కూడా కుదిరితే ప్లాన్ చేస్తాను అని అన్నారు. ఇక ఇవే కాకుండా ఆల్రెడీ అనౌన్స్ చేసిన అనగనగా ఒక రాజు సినిమా కూడా చేతిలో ఉంది. తాజాగా మైత్రి మూవీస్ బ్యానర్ లో కూడా ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు అరడజను సినిమాలతో నవీన్ బిజీగా ఉన్నాడు.