నాకు బతకడమే ఓ కల : 28న ఐరా

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 04:14 AM IST
నాకు బతకడమే ఓ కల : 28న ఐరా

Updated On : March 27, 2019 / 4:14 AM IST

నయనతార..ఈమె సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఆమె ఎంచుకున్న కథలు అలా ఉంటాయి. హీరోయిన్‌గా నటిస్తూనే లేడీ ఓరియెంటెండ్ సినిమాలపై మక్కువ చూపిస్తున్నారు నయన్. తమిళనాటే కాకుండా సౌత్ ఇండియాలోనే భారీ అంచనాలు ఉంటాయి. తాజాగా డబుల్ రోల్ పోషించిన సినిమా ‘ఐరా’ సినిమా మార్చి 28వ తేదీన విడుదల కానుంది. తెలుగులో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సుమారు 300 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు సినిమా నిర్మాతలు వెల్లడించారు. కోటపాటి రాజేష్ నిర్మాతగా సర్జన్ కె.ఎమ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. గంగా ఎంటర్ టైన్స్ మెంట్స్, కేజీఆర్ స్టూడియోస్ సినిమాను రూపొందించారు. 
Read Also : రాణి ముఖర్జీ ‘Mardani 2’ షూటింగ్ మొద‌లు

ఇటీవలే చిత్ర టీజర్‌ను విడుదల చేసింది. ‘అందరికీ సంతోషంగా బతకడం ఓ కల. కానీ జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియని నాకు బతకడమే ఓ కల’ అనే డైలాగ్ అందరిలోని ఆసక్తిని క్రియేట్‌ చేసింది. హర్రర్, థ్రిల్లర్ అంశాలతో పాటు ప్రేక్షకులను కట్టిపడేసే భావోద్వేగాలుంటాయని నయన్ తెలిపింది. ఆమె నటిస్తున్న రెండు పాత్రలు చాలా బలంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. ఆమె భవాని, యమున పాత్రల్లో నటించారు. ఇందులో ఒక పాత్ర పూర్తిగా నల్లగా ఉంటుంది. వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న న‌య‌న‌తార.. ఐరాతో మ‌రో విజ‌యం అందుకుంటాన‌ని ధీమాగా చెబుతోంది. ‘ఐరా’ సినిమా ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలి.
Read Also : ‘మహర్షి’ మ్యూజికల్ జర్నీ