Nayan-Vignesh : ఫస్ట్ టైం తమ కవల పిల్లలతో బయట కనపడ్డ నయన్, విగ్నేష్..
నయన్ - విగ్నేష్ పిల్లలు పుట్టినప్పుడు కేవలం వాళ్ళ కాళ్ళు, చేతులు మాత్రమే కనపడేలా ఫోటోలు పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాళ్ళ పిల్లలతో నయన్, విగ్నేష్ బయట కనపడలేదు. తాజాగా నయన్, విగ్నేష్ దంపతులు తమ కవల పిల్లలతో................

Nayanthara and Vignesh Sivan were spotted outside with their twins for the first time
Nayan-Vignesh : లేడీ సూపర్ స్టార్ నయనతార తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దర్శకుడు విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని కొన్ని నెలల క్రితం సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకి తల్లి అయింది. ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తూనే మరోవైపు సినిమాలతో కూడా బిజీగా ఉంది నయన్. ఇటీవలే కనెక్ట్ అనే ఓ హారర్, థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది నయన్.
సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లల్ని కన్నామని నయన్, విగ్నేష్ చెప్పినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఇది వివాదం కూడా అయింది. పలువురు దీనిపై కోర్టులో కేసు వేసినా సక్రమంగానే, అన్నీ రూల్స్ పాటించి సరోగసి ద్వారా పిల్లల్ని కన్నామని నయన్ – విగ్నేష్ దంపతులు చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం దీనిపై ఓ కమిటీ కూడా వేసి విచారించి వీరికి క్లీన్ చీట్ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నయన్ – విగ్నేష్ పిల్లలు పుట్టినప్పుడు కేవలం వాళ్ళ కాళ్ళు, చేతులు మాత్రమే కనపడేలా ఫోటోలు పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాళ్ళ పిల్లలతో నయన్, విగ్నేష్ బయట కనపడలేదు. తాజాగా నయన్, విగ్నేష్ దంపతులు తమ కవల పిల్లలతో ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీంతో మీడియా వాళ్ళు వెంట పడ్డారు. ఇద్దరూ చెరో బాబుని ఎత్తుకొని కారులోంచి దిగి విమానాశ్రయం లోపలి వెళ్లిపోయారు. అయితే పిల్లల ఫేస్ లు మాత్రం చూపించలేదు. దీంతో నయన్, విగ్నేష్ తమ కవల పిల్లల్ని ఎత్తుకొని వెళ్లిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పిల్లలిద్దరికీ ఒకే డ్రెస్సు వేయడం విశేషం.
#Nayanthara And #VigneshShivan Spotted At Mumbai Airport With Their Twin Sons pic.twitter.com/uEg3PiJg6i
— Sreedhar Sri (@SreedharSri4u) March 8, 2023
#Nayanthara & #VigneshShivan With Their Kids Spotted At Mumbai Airport…#Bollywood #BollywoodNews pic.twitter.com/d9t1mlwyin
— Bollywood Only (@BollywoodOnly1) March 8, 2023