‘నేర్కొండ పార్వై’ – 50 డేస్
'తల' అజిత్ కుమార్ నటించిన 'నేర్కొండ పార్వై' (పింక్ రీమేక్) విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది..

‘తల’ అజిత్ కుమార్ నటించిన ‘నేర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది..
‘తల’ అజిత్ కుమార్ నటించిన ‘నేర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తమిళ సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ మూవీలో నటించేప్పుడు తన భార్య స్వర్గీయ శ్రీదేవి.. అజిత్‌తో ఓ సినిమా చెయ్యాలి అని చెప్పడంతో ‘నేర్కొండ పార్వై’ చిత్రానికి శ్రీకారం చుట్టామని, ఈ రకంగా శ్రీదేవి కోరిక నెరవేర్చానని బోనీ కపూర్ ‘నేర్కొండ పార్వై’ ప్రమోషన్స్‌లో ఉద్వేగంతో చెప్పారు.
శ్రద్ధా శ్రీనాధ్, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా కీలక పాత్రల్లో నటించిన ‘నేర్కొండ పార్వై’ తమిళనాట ఆగస్టు 8న విడుదలైంది. అజిత్ లాంటి స్టార్ హీరో, తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరో మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమా చెయ్యడం, మహిళల తరపున పోరాడే లాయర్ క్యారెక్టర్ చెయ్యడం కోలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకపోయినా, అజిత్ సోలో పర్ఫార్మెన్స్‌తో సినిమాను నడిపించేశాడు. ఈ సినిమాకి అజిత్ ఫ్యాన్స్‌తో పాటు మహిళా ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు..
Read Also : మార్జావాన్ – ట్రైలర్..
విద్యా బాలన్, కల్కీ కొచ్లిన్ గెస్ట్ రోల్స్ చేసిన ‘నేర్కొండ పార్వై’ సెప్టెంబర్ 26 నాటికి తమిళనాట దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. దర్శకుడు హెచ్.వినోద్, నిర్మాత బోనీ కపూర్‌లతో అజిత్ తన తర్వాతి సినిమా చేస్తున్నాడు. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. తల 60 వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.