OTT Movies : పవన్ OG, నాని హిట్ 3, VD12, రవితేజ.. సినిమాలు థియేటర్ రిలీజ్‌కి ముందే ఓటీటీ అనౌన్స్.. ఓటీటీ పండగ..
నెట్ ఫ్లిక్స్ పండగ అంటూ తన ఓటీటీలలో రాబోటీయే సినిమాలను నేడు అనౌన్స్ చేసింది.

Netflix Announce their OTT Movies OG Hit 3 VD12 and so many in List
OTT Movies : సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాకో లేదా సినిమా రిలీజ్ తో పాటు ఓటీటీ పార్ట్నర్ ని అనౌన్స్ చేస్తారు. చాలా రేర్ గా మాత్రమే థియేటర్ లో రిలీజ్ కంటే ముందే ఓటీటీ పార్ట్నర్ ని అనౌన్స్ చేస్తారు. ఇటీవల థియేటర్స్ కి జనాలు రాకపోవడానికి ఓటీటీలే కారణం, థియేటర్లోకి వచ్చిన నెల రోజుల లోపే ఓటీటీలో సినిమాలు వచ్చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : Daaku Maharaaj Collections : బాలయ్య ‘డాకు మహారాజ్’.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
కానీ బడ్జెట్స్ పెరుగుతుండటంతో నిర్మాతలే ముందే ఓటీటీలతో డీలింగ్స్ సెట్ చేసుకొని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీలు చెప్పిన టైంకే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని ఓటీటీలు సినిమాలు తమ ఓటీటీలో రిలీజ్ అవుతాయని థియేటర్ రిలీజ్ కంటే ముందే అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా నేడు సంక్రాంతి సందర్భంగా టాప్ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ తమ ఓటీటీలోకి రాబోయే సినిమాలని ప్రకటించింది.
నెట్ ఫ్లిక్స్ పండగ అంటూ తన ఓటీటీలలో రాబోటీయే సినిమాలను నేడు అనౌన్స్ చేసింది. వీటిల్లో.. పవన్ కళ్యాణ్ OG సినిమా, నాని హిట్ 3 సినిమా, విజయ్ దేవరకొండ VD12 సినిమా, నాగచైతన్య తండేల్ సినిమా, రవితేజ మాస్ జాతర సినిమా, మ్యాడ్ సీక్వెల్, సిద్ధూ జొన్నలగడ్డ జాక్ సినిమా, కోర్ట్ సినిమా, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక తమ ఓటీటీలలోకి వస్తాయి అని ప్రకటించింది. సాయంత్రం వరకు ఇంకా కొన్ని సినిమాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలన్నీ మంచి హైప్ ఉన్న సినిమాలు కావడం విశేషం.
దీంతో ఇంత హైప్ ఉన్న సినిమాలకు ముందే ఓటీటీ ఎలా ప్రకటిస్తారు అంటూ పలువురు అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఓటీటీ ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఈ సినిమాలు రిలీజ్ అయి ఓటీటీలోకి వచ్చాక చూసేయొచ్చు అని అంటున్నారు. మొత్తానికి సంక్రాంతి పండక్కి నెట్ ఫ్లిక్స్ పండగ భారీగానే తన రాబోయే సినిమాలను ప్రకటించింది.