Adipurush : ఆదిపురుష్ కంటే జపనీస్ తీసిన రామాయణం బెటర్.. నెటిజెన్లు ట్వీట్స్!

ప్రభాస్ ఆదిపురుష్ చిత్రాన్ని జపనీస్ తీసిన రామాయణంతో పాలిస్తూ దర్శకుడు ఓం రౌత్ ని పలువురు నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.

Adipurush : ఆదిపురుష్ కంటే జపనీస్ తీసిన రామాయణం బెటర్.. నెటిజెన్లు ట్వీట్స్!

Netijens says Japanese Ramayana is better than Prabhas Adipurush

Prabhas Adipurush : బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. రామాయణ కథాంశంతో వచ్చిన ఈ సినిమాని టి సిరీస్ – రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాలు మధ్య ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద విమర్శలు ఎదురుకుంటుంది. రామాయణంలోని పాత్రలను వక్రీకరిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా ఉందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Adipurush : ఆ రికార్డులో ఇండియాలోనే ఏకైక స్టార్ ప్రభాస్.. మూడు సినిమాలతో మొదటిరోజు!

ఇక కొందరు నెటిజెన్లు అయితే ఈ సినిమాని ఒక జపనీస్ మూవీతో పాలిస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. 1992లో వచ్చిన “రామాయణ : ది లెజెండ్ అఫ్ ప్రిన్స్ రామ” యానిమేటెడ్ మూవీని జపనీస్ దర్శకులు తెరకెక్కించారు. జపనీస్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాని చూపిస్తూ.. భారతీయ దర్శకుడు ఓం రౌత్ నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. జపనీస్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఓం రౌత్ వెర్షన్ కి కంటే చాలా బెటర్ అంటూ ఆ చిత్రంలోని కొన్ని సీన్స్ ని పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Adipurush: ఆదిపురుష్ సినిమా కాంట్రవర్సీలోకి మహా సీఎంను లాగిన నెటిజెన్.. ఫోన్ నంబర్ షేర్ చేయమంటూ ఝలక్ ఇచ్చిన థానే పోలీస్

ఇది ఇలా ఉంటే, ఈ సినిమా పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయ్యింది. హిందూ సేన’ అధ్యక్షుడు విష్ణు గుప్తా.. వాల్మీకి రామాయణం మరియు తులసీదాస్ రామచరిత మానస్‌లోని పాత్రల వర్ణనకు ఆదిపురుష్ లో చూపించిన పాత్రలకు చాలా భిన్నంగా ఉన్నాయంటూ ఆదిపురుష్ మూవీ టీం పై కేసు వేశారు. అలాగే నేపాల్ కూడా ఈ మూవీ పై అభ్యంతరం వ్యక్తం అవుతుంది. సీత మాత జన్మస్థలం నేపాల్ అయితే భారతదేశం అని చుపించారంటూ అక్కడి నేతలు మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.