రిలీజ్ డేట్స్ మారాయిగా!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ విడుదల తేదీలు ఖరారు..

  • Published By: sekhar ,Published On : November 22, 2019 / 09:17 AM IST
రిలీజ్ డేట్స్ మారాయిగా!

Updated On : November 22, 2019 / 9:17 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ విడుదల తేదీలు ఖరారు..

ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల అంటే బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పదు. రాబోయే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాలతో పోటీపడుతున్నారు. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’, బన్నీ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు జనవరి 12న విడుదల చేయనున్నట్టు దర్శక, నిర్మాతలు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అప్పటి నుండి రిలీజ్ డేట్స్ చేంజ్ అవుతాయనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఎట్టకేలకు రిలీజ్ తేదీలు ఖరారు చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకరోజు మందుగా జనవరి 11న విడుదల కానుండగా, ‘అల వైకుంఠపురములో’ ముందు అనుకున్న జనవరి 12నే రిలీజ్ కానుంది. నిర్మాతలు చినబాబు, అనిల్ సుంకర నిర్మాతల మండలితో చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చారు.

Read Also : శ్రీను సినిమాకు జక్కన్న విషెస్

ఈ మేరకు ‘యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్’ (ATFPG) ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. శుక్రవారం సాయంత్రం  ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రిలీజ్ చేయనుండగా, ‘అల వైకుంఠపురములో’ నుండి ‘ఓ మై గాడ్ డాడీ’ ఫుల్ సాంగ్ విడుదల కానుంది.

Image