Love Mocktail 2 : ‘లవ్ మాక్‌టైల్ 2’ నుంచి బ్రేకప్ సాంగ్ వీడియో రిలీజ్.. ‘నీదేలే నీదేలే జన్మ..’ సాంగ్ చూశారా?

ఇప్పటికే లవ్ మాక్‌టైల్ 2 నుంచి ఓ పాట రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ బ్రేకప్ సాంగ్ వీడియో విడుదల చేశారు.

Love Mocktail 2 : ‘లవ్ మాక్‌టైల్ 2’ నుంచి బ్రేకప్ సాంగ్ వీడియో రిలీజ్.. ‘నీదేలే నీదేలే జన్మ..’ సాంగ్ చూశారా?

Nidele Nidele Janma Video Song Released From Darling Krishna Love Mocktail 2 Movie

Updated On : April 9, 2024 / 8:57 AM IST

Love Mocktail 2 Breakup Song : కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్ 2’ సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. డార్లింగ్ కృష్ణ, రాచెల్ డేవిడ్, మిలనా నాగరాజ్, రచన, అమృత.. పలువురు ముఖ్య పాత్రలో డార్లింగ్ కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కిన లవ్ జానర్ సినిమా ‘లవ్ మాక్‌టైల్ 2’. లవ్ మాక్‌టైల్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కన్నడలో భారీ విజయం సాధించింది. దీంతో త్వరలో తెలుగులోకి కూడా తీసుకువస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే లవ్ మాక్‌టైల్ 2 నుంచి ఓ పాట రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ బ్రేకప్ సాంగ్ వీడియో విడుదల చేశారు. ‘నీదేలే నీదేలే జన్మ..’ అంటూ ఈ బ్రేకప్ సాంగ్ సాగుతుంది. గురుచరణ్ ఈ పాట లిరిక్స్ రాయగా నకుల్ అభయాన్కర్ సంగీత దర్శకత్వంలో సురేంద్రనాథ్ పాడారు. ఈ బ్రేకప్ సాంగ్ లో హీరో తన ప్రియురాలి జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడటం చూపించారు.

Also Read : Vishwambhara : ఒక్క పోస్ట్‌తో ‘విశ్వంభర’ సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన డైరెక్టర్.. ధర్మ యుద్ధం మొదలు..

ఈ లవ్ మాక్‌టైల్ 2 సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై MVR కృష్ణ రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా MVR కృష్ణ మాట్లాడుతూ.. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ లవ్ మాక్‌టైల్ 2 సినిమాని వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. తాజాగా బ్రేకప్ సాంగ్ విడుదల చేశాం. త్వరలోనే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.