Niharika Konidela : మరోసారి డైవర్స్‌పై ఇండైరెక్ట్ గా మాట్లాడిన నిహారిక.. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉండాలి అంతే..

నిహారిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా తన డైవర్స్ గురించి, మళ్ళీ పెళ్లి గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడింది.

Niharika Konidela : మరోసారి డైవర్స్‌పై ఇండైరెక్ట్ గా మాట్లాడిన నిహారిక.. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉండాలి అంతే..

Niharika Comments on Her Divorce and Future love Goes Viral

Updated On : July 31, 2024 / 1:06 PM IST

Niharika Konidela : మెగా డాటర్ గానే కాక యాంకర్ గా, నటిగా, నిర్మాతగా కూడా నిహారిక కొణిదెల బాగా పాపులర్ అయింది. అయితే నిహారిక గతంలో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకోగా కొన్నాళ్ల తర్వాత వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో నిహారిక కొంచెం సైలెంట్ అయినా ఇప్పుడు మళ్ళీ వర్క్ మీద ఫోకస్ పెట్టి దూసుకుపోతుంది. గతంలో పలు ఇంటర్వ్యూలలో తన డైవర్స్ గురించి కామెంట్స్ చేసింది నిహారిక. అయితే ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయి నిహారిక హ్యాపీగా తన వర్క్ తను చూసుకుంటుంది.

నిహారిక నిర్మాతగా నిర్మించిన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్లు ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా తన డైవర్స్ గురించి, మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడింది.

Also Read : Raj Tarun – lavanya : నేడు మీడియా ముందుకు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రి.. లావణ్య వివాదం గురించి మాట్లాడతారా?

ఇంటర్వ్యూలో మీ పర్సనల్ విషయాల నుంచి మూవ్ ఆన్ అయిపోయారా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అని అడగ్గా నిహారిక సమాధానమిస్తూ.. ఆ టైం వెళ్ళిపోయింది. ప్రస్తుతం నేను నా వర్క్ మీద ఫోకస్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం యాక్టింగ్, సినిమాలు నిర్మించడం పైనే దృష్టి పెడుతున్నాను. నేను జస్ట్ హ్యాపీగా ఉండాలి అంతే. అది సింగిలా లేదా కమిటెడ్ అనేది సమయం నిర్ణయిస్తుంది. నేను ఏది కావాలని వెతుక్కొని వెళ్ళను. రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నా పేరెంట్స్ కూడా ఈ విషయంలో నాకు స్వేచ్ఛనిచ్చారు. వాళ్ళు నన్ను ఆ విషయంలో ప్రెజర్ చేయరు అని తెలిపింది. దీంతో నిహారిక వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.