నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం..హాజరైన చిరంజీవి దంపతులు

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కుమర్తె నిహారిక ఎంగేజ్ మెంట్ జరిగింది. బిజినెస్ మెన్ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో 2020, ఆగస్టు 13వ తేదీ గురువారం ఈ కార్యక్రమం జరిగింది.
గుంటూరుకు చెందిన ఐజీ కొడుకు చైతన్య. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితు సమక్షంలో ఈ వేడుక జరిగింది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరై నిహారిక, చైతన్యలను ఆశీర్వదించారు.
గుంటూరు జిల్లాకు చెందిన IG జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం స్నేహితులు.