నిశ్చితార్థం అయిపోయిందా? మ్యారేజ్ గురించి హింట్ ఇచ్చిన మెగా డాటర్..

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పెళ్లి గురించి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చిందా?

  • Published By: sekhar ,Published On : June 18, 2020 / 07:05 AM IST
నిశ్చితార్థం అయిపోయిందా? మ్యారేజ్ గురించి హింట్ ఇచ్చిన మెగా డాటర్..

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పెళ్లి గురించి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చిందా?

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది మెగా డాటర్ నిహారిక. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన పెళ్లి గురించి నిహారిక తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి నెటిజన్లలో క్యూరియాసిటీ కలిగిస్తోంది. నిహారికకు వచ్చే ఏడాది పెళ్లి చేసేస్తామని ఇటీవల నాగబాబు చెప్పారు. 

ఇక మెగా డాటర్ పోస్ట్ విషయానికొస్తే.. స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘మిస్ నీహ’ అని రాసి ఉండగా.. దానిలో ‘మిస్’ను కొట్టేసి దానికింద ‘మిసెస్’ అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘ఉహ్.. వాట్?’ అని కామెంట్ చేసింది. దీంతో నిహారిక పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే నిహారిక నిశ్చితార్థం జరిగిపోయిందని, ఈ వార్త కేవలం ఇరుకుటుంబాలకు మాత్రమే పరిమితమని తెలుస్తోంది. నాగబాబు కూతురు ఎంగేజ్‌‌మెంట్ అంటే చిన్న విషయమా? ధూం ధాం గా చేస్తారు కదా అనే సందేహం రావడం సహజం..

Niharika

అయితే మంచి రోజులు లేనందున ముందుగా ఇరుకుటుంబాల మధ్య మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుక జరిగిందని అంటున్నారు. ఇక మెగా డాటర్ పోస్ట్ చూసిన నెటిజన్లు నిహారిక పెళ్లి సెటిల్ అయిపోయింది, ఇప్పటికే ఎంగేజ్‌‌మెంట్ కూడా జరిగిపోయిందని ఆమెకు కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు కూడా. నిహారిక పోస్టుపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు ఎదురుచూడాలి మరి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Uh.. what?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Read:  నిన్న అక్కినేని నేడు దగ్గుబాటి!