Nikhil Siddhartha : నిఖిల్ చేతుల మీదగా.. ఎఫ్‌ఎన్‌సిసి ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఓపెనింగ్..
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ చేతుల మీదగా.. ఎఫ్‌ఎన్‌సిసి ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఓపెనింగ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

Nikhil Siddhartha at FNCC all India Open bridge tournament event
Nikhil Siddhartha : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్.. ఒక పక్క పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూనే, మరో పక్క టాలీవుడ్ నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్స్ క్రికెటర్ గా కూడా కనిపిస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. తాజాగా ఈ హీరో ఎఫ్‌ఎన్‌సిసి (FNCC) నిర్వహించే ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ని ప్రారంభించారు. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ టోర్నమెంట్ అయిన ఈ కార్యక్రమం ఓపెనింగ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో నిఖిల్, ఫార్మర్ క్రికెటర్ మరియు ముంబై మాస్టర్స్, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ఫ్రాంచెస్ కో ఓనర్ శ్రీ చాముండేశ్వరనాథ్, ఎఫ్‌ఎన్‌సిసి వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మల రంగారావుతో ఇతర మెంబెర్స్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో చైనాలో జరిగిన టోర్నమెంట్స్ లో సిల్వర్ మెడల్స్ గెలిచిన పలువురిని ఘనంగా సత్కరించారు.
Also read : Allu Ayaan : అప్పుడే జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టిన అల్లు అయాన్..
కాగా ఈ టోర్నమెంట్ లో మొత్తం 69 టీములు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతూ.. ఎఫ్‌ఎన్‌సిసి వైస్ ప్రెసిడెంట్ అన్ని టీమ్స్ కి ఆల్ ద బెస్ట్ తెలియజేసారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న నిఖిల్ మాట్లాడుతూ.. తమలాంటి యాక్టర్స్ ని ఇలాంటి ఫంక్షన్స్ కి పిలిచి స్పోర్ట్స్ మెన్స్ తో కలిసే అవకాశం కల్పిస్తునందుకు కృతజ్ఞతలు తెలియజేసారు. స్పోర్ట్స్ టోర్నమెంట్ లో ఇంటర్నేషనల్ వరకు వెళ్లి ఇండియా కోసం గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలిచిన ఆటగాళ్లని కలవడం, వాళ్ళని సత్కరించడం చాలా ఆనందంగా ఉందంటూ నిఖిల్ పేర్కొన్నారు.