SPY Movie : నిఖిల్ స్పై టీజర్ రిలీజ్.. సుభాష్ చంద్రబోస్ గురించి నిజం చెప్పాలి..
కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ సిద్దార్థ ఇప్పుడు స్పై మూవీతో మరో హిట్టు కోసం ట్రై చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ని..

Nikhil Siddhartha pan india movie SPY teaser released
Nikhil Siddhartha SPY Movie : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. కార్తికేయ 2తో (Karthikeya 2) పాన్ ఇండియా హిట్టుని అందుకున్న నిఖిల్.. 18 పేజెస్ సినిమాతో ఒక లవబుల్ హిట్టుని కూడా ఎకౌంట్ లో వేసుకున్నాడు. తాజాగా స్పై (SPY) అనే మూవీతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేశాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఇక ఇటీవల ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రకటించి మూవీ పై భారీ హైప్ ని కలగజేశారు.
Aadi Keshava : ఆదికేశవగా వైష్ణవ తేజ్ రుద్ర తాండవం..
తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉండే కర్తవ్యపథ్ దగ్గర ఈ టీజర్ ని విడుదల చేశారు. ఇక ఈ టీజర్ అందరి అంచనాలు తగ్గట్టు ఉంది. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడు అంటూ మనం చదువుకున్నాం. అయితే అది ఒక కవర్ స్టోరీ అని, అసలు నిజం ఈ సినిమాతో చెబుతాం అంటున్నాడు నిఖిల్. టీజర్ చూస్తుంటే.. సినిమాలో ఓ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని తెలుస్తుంది.
Ram Charan : ముంబైలో 1000 మంది రామ్‌చరణ్ ఫ్యాన్స్.. దాదాపు తొమ్మిది వేల మందికి సేవ!
ఇక ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్ గా నటిస్తుంది. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 వంటి సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ‘గర్రి బిహెచ్’ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీచరణ్ పకల ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కె రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.