ఎవరు ఎన్ని అనుకున్నా.. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఉన్నది ఫ్యూర్ లవ్..
‘భీష్మ’ సిినిమా ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్ అంటే తనకెంత అభిమానమో తెలిపిన యంగ్ హీరో నితిన్..

‘భీష్మ’ సిినిమా ప్రమోషన్స్‌లో పవన్ కళ్యాణ్ అంటే తనకెంత అభిమానమో తెలిపిన యంగ్ హీరో నితిన్..
యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘#Bheeshma’. ఫిబ్రవరి 21న ప్రేక్షకులముందుకు వస్తోంది. ఈ సందర్భంగా యంగ్ హీరో నితిన్ మీడియాతో ముచ్చటించారు.
*అందుకే ఆలస్యం.. ‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్ జరుగుతున్న టైంలో ఫస్ట్ ‘భీష్మ’ లైన్ చెప్పాడు వెంకీ. ఆ తరువాత ఆ లైన్‌ను ఫుల్ స్క్రిప్ట్‌గా డెవలప్ చెయ్యడానికి చాలా టైమ్ తీసుకున్నారు. అందులోనూ ఈ సారి నేను పూర్తి స్క్రిప్ట్ లాక్ అయ్యాకే సినిమా మొదలుపెట్టాలి అనుకున్నాను. అలా వన్ ఇయర్ లేట్‌గా సినిమాని మొదలు పెట్టాము. ఈ మధ్యలో నేను ‘రంగ్‌దే’ సినిమా అలాగే ‘అంధాదున్’ అనే మరో సినిమా కూడా స్టార్ట్ చేశాం. లాస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరం మూడు సినిమాలు చేస్తున్నాను.
*ప్రమోషన్ కోసం పవన్ పేరుని వాడుకోవడం లేదు..
నా ఫస్ట్ సినిమా ‘జయం’ నుండి అన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ గారి సాంగో, ఆయన పోస్టరో, ఆయన మ్యాడులేషనో ఏదో రకంగా ఆయన నా సినిమాలో కనిపిస్తారు. లేదా వినిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఉన్నది ఫ్యూర్ లవ్. ఎవరు ఎన్ని అనుకున్నా నేను ఆయనకి జెన్యూన్ అభిమానిని.
*ఈ బ్యానర్ అంటే చాలా ఇష్టం..
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నానంటే ఈ బ్యానర్ అంటే ఎంత ఇష్టపడుతున్నానో మీరే ఊహించుకోండి. వీళ్లు తీసే అన్ని సినిమాల్లోనూ నిర్మాణ విలువలు హై లెవల్లో ఉంటాయి. ‘అ ఆ’ మూవీ నుంచి ఈ బ్యానర్‌తో నా జర్నీ మొదలైంది. ‘భీష్మ’ తర్వాత మళ్లీ ఇదే బ్యానర్‌లో ‘రంగ్ దే’ చేస్తున్నా. దాని తర్వాత కూడా మరో సినిమా చేద్దామని నిర్మాత నాగవంశీ అంటున్నారు.