Nivetha Pethuraj : సినిమా ఆఫర్లు లేకపోతే ఉద్యోగం చేసుకుంటాను.. భయపడాల్సిన అవసరం లేదు..

నివేతా మాట్లాడుతూ.. ''నేను అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చాను. హీరోయిన్‌ అని పిలిపించుకోవడం కంటే కూడా నటిగా అనిపించుకోవడమే నాకు............................

Nivetha Pethuraj : సినిమా ఆఫర్లు లేకపోతే ఉద్యోగం చేసుకుంటాను.. భయపడాల్సిన అవసరం లేదు..

Nivetha

Updated On : May 18, 2022 / 7:31 AM IST

Nivetha Pethuraj :  మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నివేతా పేతురాజ్ ఆ తర్వాత బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్ సినిమాలతో మెప్పించింది. అయితే నివేతా ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా తెలుగు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానో లేక హీరోయిన్ కి తక్కువ స్కోప్ ఉన్న పాత్రలో వస్తున్నాయి. తమిళ్ లో మాత్రం హీరోయిన్ గా పలు సినిమాలు వస్తున్నాయి. త్వరలో నివేతా విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Road Accident : బాలకృష్ణ ఇంటి గేటుని ఢీ కొట్టిన జీపు.. తృటిలో తప్పిన ప్రమాదం..

 

ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది. నివేతా మాట్లాడుతూ.. ”నేను అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చాను. హీరోయిన్‌ అని పిలిపించుకోవడం కంటే కూడా నటిగా అనిపించుకోవడమే నాకు గర్వంగా ఉంటుంది. చాలా మంది హీరోయిన్స్ గా సినిమాలు చేయకపోతే కెరీర్‌ ఉండదేమో అని భయపడతారు. నాకు అలాంటి భయం ఏమి లేదు. నటనకు ఇంపార్టెన్స్‌ ఉంటే ఎలాంటి రోల్స్‌ అయినా చేస్తాను. సినిమాలో నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉండి నిడివి కొద్దీ సేపే ఉంటుంది అని చెప్పినా చేస్తాను. ఒకవేళ సినిమా ఆఫర్లు రాకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను. సినిమాల్లోకి రాకముందు బొటిక్‌ నిర్వహించేదాన్ని. పలు ఈవెంట్లు, కార్ల కంపెనీలో కూడా పని చేశాను” అని తెలిపింది.