Khushi : ఖుషి రీ రిలీజ్‌కి థియేటర్లు లేవు.. నిరాశలో ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిన సినిమా 'ఖుషి'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఈ రీ-రిలీజ్‌కి థియేటర్లు లేవని చెబుతున్నారు మల్టీప్లెక్స్ యాజమాన్యం.

Khushi : ఖుషి రీ రిలీజ్‌కి థియేటర్లు లేవు.. నిరాశలో ఫ్యాన్స్!

no theaters for kushi re release

Updated On : December 29, 2022 / 10:13 AM IST

Khushi : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిన సినిమా ‘ఖుషి’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భూమిక చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లవ్ మూవీస్ కి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. సినిమా విడుదలయ్యి 22 ఏళ్ళు అవుతున్నా, ఇప్పటికి ఈ మూవీ రెఫరెన్స్ తో కొన్ని సన్నివేశాలు రాసుకుంటారు ఇప్పటి మేకర్స్.

Kushi Re-Release: పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. న్యూ ఇయర్‌కి ఖుషి రీ రిలీజ్!

ప్రస్తుతం నటుడిగా, విలన్ గా అలరిస్తున్న ఎస్ జె సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే అభిమానులకు ఒక కొత్త అనుభవాన్ని అందజేసింది. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా రికార్డులు సృష్టిస్తుంది. అంత రెఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది ఈ మూవీ. ఇక ఈ మూవీని ఈ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. కాగా ఈ రీ-రిలీజ్‌కి థియేటర్లు లేవని చెబుతున్నారు మల్టీప్లెక్స్ యాజమాన్యం.

అయితే ఈ సమస్య ఇండియాలో కాదు అమెరికాలో. గతంలో కూడా పలువురు స్టార్ హీరోల సినిమాలు అక్కడ కూడా రీ రిలీజ్ అవ్వగా నష్టాలే మిగిల్చాయని, అందుకే ఈసారి రీ రిలీజ్‌కి థియేటర్లు ఇవ్వబోమని థియేటర్ ఓనర్స్ తెలియజేశారు. దీంతో యూఎస్‌లోని పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కాగా ఇండియాలో ఈ రీ రిలీజ్‌ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అభిమానులైతే థియేటర్ల వద్ద హంగామా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.