Prabhas: ప్రభాస్ రీ రిలీజ్ సినిమాలకు దొరకని థియేటర్లు..
స్టార్ హీరోల పుట్టినరోజున.. వారి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండగా, ఈ నెల 23న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో అతడి సూపర్ హిట్ సినిమా అయిన “వర్షం” మరియు "బిల్లా" సినిమాలను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా చేశారు. కానీ ప్రదర్శించడానికే థియేటర్లు దొరకడం లేదు నిర్వాహకులకు.

No Theaters for Prabhas Re Release Movies
Prabhas: స్టార్ హీరోల పుట్టినరోజున.. వారి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండగా, ఈ నెల 23న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో అతడి సూపర్ హిట్ సినిమా అయిన “వర్షం” మరియు “బిల్లా” సినిమాలను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా చేశారు.
Prabhas: “కాంతారా” సినిమాపై ప్రభాస్ ప్రశంసల జల్లు..
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ప్రదర్శించడానికే థియేటర్లు దొరకడం లేదు నిర్వాహకులకు. కారణం ఈ దీపావళికి కొత్త సినిమాల విడుదల ఉండడం. పెద్ద సినిమాల రిలీజ్ లు ఏవి దగ్గరిలో లేకపోవడంతో.. చిన్న బడ్జెట్ సినిమాలన్నీ వరుసపెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి.
అసలే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి. ఈ సమయంలో బయ్యర్స్ రీ రిలీజ్ కి స్క్రీన్స్ ఇవ్వడాన్ని తప్పుబడతున్నారు నిర్మాతలు. దీంతో ప్రభాస్ పుట్టినరోజున వర్షం మూవీ ప్రదర్శనను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నిర్వాహకులు ఈ సినిమాను 5 రోజుల తరువాత అక్టోబర్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.