NTR – Hrithik Roshan : హృతిక్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్.. స్పై యూనివర్స్‌లోకి యంగ్ టైగర్!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో (Hrithik Roshan) కలిసి ఎన్టీఆర్ (NTR) వార్ సీక్వెల్ లో నటించబోతున్నాడట. ఈ సినిమా స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించబోతున్నారు.

NTR and Hrithik Roshan are act together in War 2
NTR – Hrithik Roshan : ఇటీవల ఒక ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్స్, మరో ఇండస్ట్రీలోని హీరోలతో జత కట్టడం కామన్ అయ్యిపోయింది. ఈ క్రమంలోనే పలు క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. తాజాగా ఒక బిగ్గెస్ట్ కాంబినేషన్ సెట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) 2019 నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వార్ (War). ఈ సినిమాలో హృతిక్ తో పాటు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) కూడా నటించాడు. సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి తాజాగా సీక్వెల్ ప్రకటించారు మేకర్స్.
Pushpa 2 : పుష్ప 2 అప్డేట్ వచ్చేసింది.. పుష్ప రాజ్ ఎక్కడ?
బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) వార్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ సీక్వెల్ ని స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించబోతున్నారు. పఠాన్, టైగర్, వార్ సినిమాలతో స్పై సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. వార్ 2 మూవీ టైగర్ 3 కి కొనసాగింపుగా ఉంటుందని తెలియజేశారు. తాజాగా వార్ 2 సినిమాకి సంబంధించి బాలీవుడ్ మీడియాలో ఒక వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. వార్ సీక్వెల్ లో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ (NTR) కూడా నటించబోతున్నాడని బి-టౌన్ మీడియా వార్తలు రాసుకొస్తుంది.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్!
RRR సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీంతో ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తే ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా మార్కెట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారట. మరి ఈ స్పై యూనివర్స్‌లోకి యంగ్ టైగర్ ఎంట్రీ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. కాగా బ్రహ్మాస్త్ర సినిమాని తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ వార్ 2 ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ పట్టాలు ఎక్కనుంది.
IT’S OFFICIAL… HRITHIK – JR NTR IN ‘WAR 2’… #YRF pulls off a casting coup… #HrithikRoshan and #JrNTR will share screen space for the first time in #War2… #AyanMukerji directs. #YRFSpyUniverse pic.twitter.com/rGu8Z3Nzs7
— taran adarsh (@taran_adarsh) April 5, 2023