Devara Record : ‘దేవర’ రిలీజ్‌కి ముందే సరికొత్త రికార్డ్.. అమెరికాలో కలెక్షన్స్ వరద..
దేవర సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేసేసారు.

NTR Devara Movie Creates New Record in America Collections Here Details
Devara Record : ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేడు సాయంత్రం దేవర ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. RRR తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : NTR Shoes Cost : ఎన్టీఆర్ వేసుకున్న షూస్ ధర ఎంతో తెలుసా? ఇది చాలా కాస్ట్లీ గురూ..
దేవర సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేసేసారు. అయితే రిలీజ్ కి ఇన్ని రోజుల ముందే ఆన్లైన్ బుకింగ్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది దేవర. అంటే ఆల్మోస్ట్ 8 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ విషయం మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు అత్యధిక వేగంగా రిలీజ్ కి ముందు 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమా దేవరనే కావడం గమనార్హం. ఇంకా రిలీజ్ కి 17 రోజులు సమయం ఉంది. ఈ లోపు ఇంకెన్ని మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందో దేవర చూడాలి.
ఈ రికార్డ్ తో ప్రభాస్ సినిమా రికార్డులు కూడా కొట్టుకుపోయాయి. సలార్, కల్కి కూడా రిలీజ్ కి 17 రోజుల ముందు ప్రీ బుకింగ్స్ లో 1 మిలియన్ డాలర్స్ సాధించలేకపోయాయాయి. మరి ఓవరాల్ గా రిలిజ్ సమయానికి ప్రీ బుకింగ్స్ తో దేవర ఇంకా సరికొత్త రికార్డులని సెట్ చేస్తుందేమో చూడాలి. ఇక ఇటీవల అమెరికా మార్కెట్ కూడా పరిగణలోకి తీసుకొని అక్కడి కలెక్షన్స్ రికార్డులు కూడా చూస్తున్నారు మన హీరోలు. ఇప్పటివరకు ప్రభాస్, మహేష్, నాని లకు పలు రికార్డులు ఉన్నాయి అమెరికా మార్కెట్ లో. మరి దేవరతో ఎన్టీఆర్ ఈ రికార్డులని తిరగరాస్తాడేమో చూడాలి.
He’s turning every part into his RED BLOOD sea ❤️🔥❤️🔥#DevaraUSA 🔥🔥#Devara pic.twitter.com/lnBQTgnkU3
— Devara (@DevaraMovie) September 10, 2024