NTR Shoes Cost : ఎన్టీఆర్ వేసుకున్న షూస్ ధర ఎంతో తెలుసా? ఇది చాలా కాస్ట్లీ గురూ..
ఎన్టీఆర్ వైట్ & బ్లాక్ కాంబినేషన్లో ఉన్న స్టైలిష్ షూ వేసుకొని ఉన్నాడు.

NTR Wears Stylish Shoes in Mumbai Shoes Cost Goes Viral
NTR Shoes Cost : ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్ళాడు. ముంబైలో అక్కడ బాలీవుడ్ వాళ్ళని కలుస్తూ, మీడియాకు ఫోజులిస్తూ హడావిడి చేస్తూ దేవరని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగను కలిసిన ఫోటో బయటకి వచ్చింది. ఈ ఫోటో వైరల్ గా మారింది.
Also Read : Vijay – Abyukta : ‘ది గోట్’ సినిమాలో విజయ్ కూతురుగా నటించింది ఎవరో తెలుసా? స్టార్ కెమెరామెన్ కూతురు..
అయితే ఈ ఫొటోలో ఎన్టీఆర్ వైట్ & బ్లాక్ కాంబినేషన్లో ఉన్న స్టైలిష్ షూ వేసుకొని ఉన్నాడు. Balenciaga అనే కంపెనీ షూస్ వేసుకున్నాడు ఎన్టీఆర్. దీంతో ఈ షూస్ ఎంత ధర ఉంటాయో అని ఫ్యాన్స్, నెటిజన్స్ వెతకడం మొదలు పెట్టారు. ఈ కంపెనీ షూస్ స్టార్టింగ్ ధరే ఆల్మోస్ట్ 40 వేలకు పైగా ఉంది. ఈ బ్రాండ్ లో లక్ష రూపాయల పైన ఉన్న షూస్ కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ వేసుకున్న మోడల్ షూస్ ధర 995 డాలర్లు ఉంది. అంటే మన రూపాయల్లో ఆల్మోస్ట్ 80 వేల రూపాయలకు పైనే.
ఇది తెలిసి ఎన్టీఆర్ 80 వేల రూపాయల షూస్ వాడుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే మన సెలబ్రిటీల దగ్గర ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ చాలానే ఉంటాయి. ఎన్టీఆర్ దగ్గర లక్షల్లో, ఏకంగా కోట్లల్లో విలువ చేసే వాచ్ లు కూడా ఉన్నాయి. వాటితో పోలిస్తే ఈ షూస్ ధర ఎన్టీఆర్ కి చాలా తక్కువే అని అనుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే వీటికి డూప్లికేట్ బ్రాండ్ ఏదన్నా దొరికితే కొనుక్కోవాలని ఆశపడుతున్నారు.