Vijay – Abyukta : ‘ది గోట్’ సినిమాలో విజయ్ కూతురుగా నటించింది ఎవరో తెలుసా? స్టార్ కెమెరామెన్ కూతురు..
'ది గోట్' సినిమాలో విజయ్ కూతురు పాత్రలో అభ్యుక్త మణికందన్ అనే అమ్మాయి నటించింది.

The Goat Movie Vijay Daughter Character Actor Abyukta Manikandan Details Here
Vijay – Abyukta : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(The Goat) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేసాడు. సినిమాలో హీరోయిన్స్ మాత్రమే కాక విజయ్ కూతురు పాత్రలో నటించిన అమ్మాయి కూడా వైరల్ అయింది. ఈ సినిమాలో విజయ్ కూతురు పాత్రలో అభ్యుక్త మణికందన్ అనే అమ్మాయి నటించింది.
Also Read : Devara Promotions : తెలుగు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి షాక్.. ‘దేవర’ తెలుగు ప్రమోషన్స్ లేవా?
అయితే అభ్యుక్త మణికందన్ ఎవరో కాదు స్టార్ సినిమాటోగ్రాఫర్ మణికందన్ కూతురు. అపరిచితుడు, రావన్, ఏ జవానీ హై దీవాని, ఓం శాంతి ఓం, ప్రేమ్ రతన్ ధన్ పాయో.. ఇలా ఎన్నో హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు మణికందన్. తెలుగులో మన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకు కూడా కెమెరామెన్ గా పనిచేసారు. మణికందన్ కూతురు అభ్యుక్త ఇప్పుడు విజయ్ గోట్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
View this post on Instagram
అభ్యుక్త ప్రస్తుతం లా చదువుతుంది. లా చదువుతూనే ఫ్యాషన్ వరల్డ్ లోకి ఎంటర్ అయి మోడల్ గా మారింది. పలు బ్యూటీ కాంటెస్ట్ లో కూడా పాల్గొంది. ఈమె భరత నాట్యం డ్యాన్సర్ కూడా. పలు స్టేజీలపై ప్రదర్శనలు కూడా ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తుంది. అయితే చదువు అయ్యాకే సినిమాల్లోకి వద్దామనుకుంది అభ్యుక్త. అభ్యుక్త తల్లి ప్రియా మణికందన్ గోట్ డైరెక్టర్, నిర్మాతలకు క్లోజ్ అవ్వడంతో ఆమెకు విజయ్ సినిమాలో ఈ పాత్రని ఆఫర్ చేసారు. విజయ్ సినిమా కావడంతో అభ్యుక్త తల్లితండ్రులు ఇద్దరూ ఒప్పుకున్నారు. భవిష్యత్తులో అభ్యుక్త మణికందన్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram